| Title | మాయలాడి | mAyalADi |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | మాయలాడి బోధనచే మయిమరచితి వేమొ మాటలాడ రావదేమిరా నా సామి | mAyalADi bOdhanachE mayimarachiti vEmo mATalADa rAvadEmirA nA sAmi |
| చరణం charaNam 1 | కాయజు బారికి తాళగలేరా కౌగిట జేర్చి నన్ను గారవించరా న్యాయమటరా నీకిది తగదుర సరగున | kAyaju bAriki tALagalErA kaugiTa jErchi nannu gAravimcharA nyAyamaTarA nIkidi tagadura saraguna |
| చరణం charaNam 2 | కలకాలము నన్ను గాసిబెట్టకురా కాంతల నేచుట కార్యము గాదుర చెలువుడవని నిను నెరనమ్మినందుకిక | kalakAlamu nannu gAsibeTTakurA kAmtala nEchuTa kAryamu gAdura cheluvuDavani ninu neranamminandukika |
| చరణం charaNam 3 | సరివారిలో నన్ను చౌక సేయకురా చాల నమ్మితి రతికేళి గూడర వరదుడ మువ్వపురి నిలయుడ చనువున | sarivArilO nannu chouka sEyakurA chAla nammiti ratikELi gUDara varaduDa muvvapuri nilayuDa chanuvuna |
One thought on “#193 మాయలాడి mAyalADi”