| Title | మాటలేల (ప్రతి) | mATalEla (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | మాటలేల చాలుచాలుర నా సామి | mATalEla chAluchAlura nA sAmi |
| బోటి తోడను పొందుగాను భోగించినావేమిర | bOTi tODanu pomdugAnu bhOgimchinAvEmira | |
| చరణం charaNam 1 | మాటికి కుంకుమ మైజారెనురా కాటుక రెప్పల కంటినదేరా యేటికి భ్రమ మదియేరా జాడ దెల్పర | mATiki kumkuma maijArenurA kATuka reppala kamTinadErA yETiki bhrama madiyErA jAda delpara |
| చరణం charaNam 2 | చిందిన గంధపు పూతలవేరా చెక్కిట చెమటలు బుట్టునదేరా సుందర నీ యధరమందు పలునొక్కులుర | chimdina gamdhapu pUtalavErA chekkiTa chemaTalu buTTunadErA sumdara nI yadharamamdu palunokkulura |
| చరణం charaNam 3 | కన్నుల నిద్దుర మబ్బులవేరా కరుణాకర సూర్యప్రభువౌర చిన్నెలు జూచి సంతసించితినేర పోపోరా | kannula niddura mabbulavErA karuNAkara sUryaprabhuvaura chinnelu jUchi samtasimchitinEra pOpOrA |