| Title | వాని జోలి నీకేలే | vAni jOli nIkElE |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | వాని జోలి నీకేలే ఇందుముఖిరో ఇందుముఖిరో ఆ వనితా బోధనచే మైమరచే | vAni jOli nIkElE indumukhirO indumukhirO A vanitA bOdhanachE maimarachE |
| అనుపల్లవి anupallavi | మానినిరో వాని మమత లెందుబోయే పూనిదాని ఇల్లుని విడిచి రాక యున్న అతడినా | mAninirO vAni mamata lendubOyE pUnidAni illuni viDichi rAka yunna ataDinA |
| చరణం charaNam 1 | ఇంతిరో నిను బాయని నాతో ఎన్నో బూటకముల బలికే నా సంతసమెల్లన చాన కొసగి నన్ను పంతముతో మరుని పలు చేసెనిక | intirO ninu bAyani nAtO ennO bUTakamula balikE nA santasamellana chAna kosagi nannu pamtamutO maruni palu chEsenika |
| చరణం charaNam 2 | మాట తప్పనివాడని నేను మనసున నెంచితి గదవే బోటిరో అలవాని మోము జూడనగునా సాటివారలు నవ్వజాలరేమె ఇక | mATa tappanivADani nEnu manasuna nenchiti gadavE bOTirO alavAni mOmu jUDanagunA sATivAralu navvajAlarEme ika |
| చరణం charaNam 3 | సింగర సుతుడు నాతో మును చేసిన చెలిమిని మరచెనే బంగారము వంటి వాని గుణములెల్ల అంగనామణి మోహాబ్ధి జేరెనిక | singara sutuDu nAtO munu chEsina chelimini marachenE bangAramu vanTi vAni guNamulella anganAmaNi mOhAbdhi jErenika |
One thought on “#378 వాని జోలి నీకేలే vAni jOli nIkElE”