#497 చెలియరో cheliyarO

TitleచెలియరోcheliyarO
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviచెలియరో నేనేమి సేతు చెలువుని బాసి
అల దాని గూడి ఇందు రాడు అలసి సొలసి
cheliyarO nEnEmi sEtu cheluvuni bAsi
ala dAni gUDi indu rADu alasi solasi
చరణం
charaNam 1
మును నన్ను గూడి ముద్దు పెట్టి ముచ్చట లాడి
వినయముతోను విభుని పక్క వేగ జేర్చవే
munu nannu gUDi muddu peTTi muchchaTa lADi
vinayamutOnu vibhuni pakka vEga jErchavE
చరణం
charaNam 2
మదిరాక్షిరో నను గూడమన్న మనసు రాదాయె
మది నిన్ను మెచ్చి మమత హెచ్చి మదిని దలతునే
madirAkshirO nanu gUDamanna manasu rAdAye
madi ninnu mechchi mamata hechchi madini dalatunE
చరణం
charaNam 3
వర రత్నపురి నిలయుని నాయొద్ద జేర్పవే
సదయుని దయ వలచి చాల కలవర మాయె
vara ratnapuri nilayuni nAyodda jErpavE
sadayuni daya valachi chAla kalavara mAye

Leave a comment