#504 చానరో వాని బాసి chAnarO vAni bAsi

Titleచానరో వాని బాసిchAnarO vAni bAsi
Written By
Bookసంగీత కళానిధిsangIta kaLAnidhi
రాగం rAgaజంఝూటిjanjhUTi
తాళం tALaరూపకrUpaka
Previously Posted At10
పల్లవి pallaviచానరో వాని బాసి నేనెటువలె సైతునేchAnarO vAni bAsi nEneTuvale saitunE
దాని బోధనలు వినుట మానడేమి సేతునేdAni bOdhanalu vinuTa mAnaDEmi sEtunE
చరణం
charaNam 1
సన్నుతాంగి సరసుడని చాల నమ్మి యుంటినే
నిన్న దాని యింట జేరి యున్న వగలు వింటినే
sannutAngi sarasuDani chAla nammi yunTinE
ninna dAni yinTa jEri yunna vagalu vinTinE
చరణం
charaNam 2
సదయుడు మదనుని బారికి ముదముతో నను ద్రోసెనే
వదలక తన ప్రాయమెల్ల సుదతి పాలు చేసెనే
sadayuDu madanuni bAriki mudamutO nanu drOsenE
vadalaka tana prAyamella sudati pAlu chEsenE
చరణం
charaNam 3
వాసవ నుతుడైన శ్రీనివాసుడు నను గూడెనే
బాసలెల్ల మఱచి యా దోసకారి గూడెనే
vAsava nutuDaina SrInivAsuDu nanu gUDenE
bAsalella ma~rachi yA dOsakAri gUDenE

Leave a comment