| Title | మాయ చేసినాడే | mAya chEsinADE |
| Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
| Book | గానామృతము | gAnAmRtamu |
| రాగం rAga | హిందుస్థాని కాఫీ | hindusthAni kAfI |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మాయ చేసినాడే చెలి మాయ చేసినాడే | mAya chEsinADE cheli mAya chEsinADE |
| చరణం charaNam 1 | వేయ సాగె సుమ సాయకు డమ్ముల డాయ వెతలు పిక దీయవె యని వాడు | vEya sAge suma sAyaku Dammula DAya vetalu pika dIyave yani vADu |
| చరణం charaNam 2 | మారుని పోర మై జారిన చెమటల నారుప వీవన తేర బొమ్మని వాడు | mAruni pOra mai jArina chemaTala nArupa vIvana tEra bommani vADu |
| చరణం charaNam 3 | చానరొ నిముసము జామయి తోచెనే కానుక దేబోదు గాదనకని వాడు | chAnaro nimusamu jAmayi tOchenE kAnuka dEbOdu gAdanakani vADu |
| చరణం charaNam 4 | ధరను భుజంగ రావు దాసుని బ్రోచిన సరసుని మాటలు వరములౌ బలె వాడె | dharanu bhujanga rAvu dAsuni brOchina sarasuni mATalu varamulau bale vADe |