| Title | ప్రియసఖి రావే | priyasakhi rAvE |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ప్రియసఖి రావే భీరా నా శయి జేరంగ | priyasakhi rAvE bhIrA nA Sayi jEranga |
| అనుపల్లవి anupallavi | తరియిదె కౌగిట తటానా నను జేర్చంగ | tariyide kaugiTa taTAnA nanu jErchanga |
| చరణం charaNam 1 | మారుని బారికి ఓర్వగలేనే మును నేరము లెన్నకా శీఘ్రామే శయి జేరంగ | mAruni bAriki OrvagalEnE munu nEramu lennakA SIghrAmE Sayi jEranga |
| చరణం charaNam 2 | భావము లోనిక తామస మేలనే జీవము నిలువే శీఘ్రామే శయి జేరంగా | bhAvamu lOnika tAmasa mElanE jIvamu niluvE SIghrAmE Sayi jErangA |
| చరణం charaNam 3 | అంగనా మణి నే నలసి సొలసితి చెంగట జేర్చవే శీఘ్రామే శయి జేరంగ | anganA maNi nE nalasi solasiti chengaTa jErchavE SIghrAmE Sayi jEranga |
| చరణం charaNam 4 | చిలుక కటారి నీ కులుకు గుబ్బాలు నా యురమున గ్రుమ్ముచూ శీఘ్రామే శయి జేరంగా | chiluka kaTAri nI kuluku gubbAlu nA yuramuna grummuchU SIghrAmE Sayi jErangA |
| చరణం charaNam 5 | మోహనాంగిరొ నీమోవి పానాక మిచ్చి భావము రంజిల్లా శీఘ్రామే శయి జేరంగా | mOhanAngiro nImOvi pAnAka michchi bhAvamu ranjillA SIghrAmE Sayi jErangA |
| చరణం charaNam 6 | శ్రీ నరసాపురి వరదుని సాక్షిగా చెలియరొ ప్రాణము నిలువదు వేగమే | SrI narasApuri varaduni sAkshigA cheliyaro prANamu niluvadu vEgamE |