#686 చలమేలర chalamElara

Title చలమేలర chalamElara
Written By??
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaనాటకురంజిnATakuranji
తాళం tALaఆదిAdi
Previously Posted At396
పల్లవి pallaviచలమేలర నాపై జలజ నేత్రుడా పిలిచిన పలుకకchalamElara nApai jalaja nEtruDA pilichina palukaka
అనుపల్లవి anupallaviకలకాలము నీ చెలిమి జేయ నే దలచి వలచి వచ్చియుంటి నంతటkalakAlamu nI chelimi jEya nE dalachi valachi vachchiyunTi nantaTa
చరణం
charaNam 1
నీ సరసములు నీటులు నీ సొగసు నీ చతురత
నీ హొయలు నీ గుణములు నీ సరిసమ రసికుల నే నరసి జూడ దొరక లేక మరులు మించి మొరలిడ
nI sarasamulu nITulu nI sogasu nI chaturata
nI hoyalu nI guNamulu nI sarisama rasikula nE narasi jUDa doraka lEka marulu minchi moraliDa
చరణం
charaNam 2
సారసరిపుని కోరు చకోర గతి నిను నమ్ముచు
సారెకును నీ మరుగున జేరదలచి చెలులతో
మనసార నా విచారమెల్ల చెవియార దెల్పియు బ్రోవక
sArasaripuni kOru chakOra gati ninu nammuchu
sArekunu nI maruguna jEradalachi chelulatO
manasAra nA vichAramella cheviyAra delpiyu brOvaka
?? A third charaNam is also available in the jAvaLi by paTTAbhirAmayya, in an earlier post. ఇంతకు ముందు ప్రచురించిన దానిలో, పట్టాభిరామయ్య గారి ఈ జావళీకి మూడో చరణము కూడా ఉన్నది.

Leave a comment