| Title | వాడా నిను | vADA ninu |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | దాసు1893 | dAsu1893 |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | వాడా నిను బంపినాడా నను బిల్వ వనిత నే రాననవే పోపోవే | vADA ninu bampinADA nanu bilva vanita nE rAnanavE pOpOvE |
| చరణం charaNam 1 | చింత లేల వాడు చీటి బంపెనా సంతోషమే యనవే పోపోవే | chinta lEla vADu chITi bampenA santOshamE yanavE pOpOvE |
| చరణం charaNam 2 | చిన్న నాట నుండి చేసిన తన తోడి చెలిమి చాలనవే పోపోవే | chinna nATa nunDi chEsina tana tODi chelimi chAlanavE pOpOvE |
| చరణం charaNam 3 | కోప మేటికి తోట్ల వల్లూరి శ్రీ వేణు గోపాలా తగుననవే | kOpa mETiki tOTla vallUri SrI vENu gOpAlA tagunanavE |
| చరణం charaNam 4 | వేయేల దాసు శ్రీరామ హృదయ వాసివై యుండుమీ యనవే పోపోవే | vEyEla dAsu SrIrAma hRdaya vAsivai yunDumI yanavE pOpOvE |