1282 ఇంత రావు inta rAvu

Titleఇంత రావుinta rAvu
Written By
Book
రాగం rAgaవసంత భైరవిvasanta bhairavi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఇంత రావు జేసితె నేనెటులోర్తునెinta rAvu jEsite nEneTulOrtune
అనుపల్లవి anupallaviఇంతి మువ్వ గోపాలుడు
వింత దాని వలె నన్ను
inti muvva gOpAluDu
vinta dAni vale nannu
చరణం
charaNam 1
మొదల వాడీడకు వచ్చి మ్రొక్కి పొంద వలనెన్న
సదయుడ వద్దు నేస్తమే చాలునంటినె
కదసి నా మాట వినక కాళ్ళ వేళ్ళ బెనగుచు
పది వేల బాసలు చేసి బాయ జాలననే వాడు
modala vADIDaku vacchi mrokki ponda valanenna
sadayuDa vaddu nEstamE chAlunanTine
kadasi nA mATa vinaka kALLa vELLa benaguchu
padi vEla bAsalu chEsi bAya jAlananE vADu
చరణం
charaNam 2
మనసు దెలియ వలసి మా యింటికి రావద్దన్న
కనుగొన దిటవు లేక కన్నీరు నించెనె
నీ ఎనకొన్న తమకాన పెదవులే దడవుచు
నిను బాయలేనని వెలత బ్రతిమాలినవా
manasu deliya valasi mA yinTiki rAvaddanna
kanugona diTavu lEka kannIru ninchene
nI enakonna tamakAna pedavulE daDavuchu
ninu bAyalEnani velata bratimAlinavA
చరణం
charaNam 3
నీ మాట నమ్మరాదోయి నే చాల గోప గత్తెను
ఏమన్న నేమి వచ్చునో ఎందుకుంటినె
మోము జూచి వాడు తన మోహమె పూటకావని
కోమలిరో మువ్వ గోపాలుడు నను గూడి
nI mATa nammarAdOyi nE chAla gOpa gattenu
Emanna nEmi vacchunO endukunTine
mOmu jUchi vADu tana mOhame pUTakAvani
kOmalirO muvva gOpAluDu nanu gUDi

Leave a comment