1283 వలపు నిలువ valapu niluva

Titleవలపు నిలువvalapu niluva
Written By
Book
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviవలపు నిలువ నాదు వశము గాదేమి సేతు వనితరో ఈ వేళvalapu niluva nAdu vaSamu gAdEmi sEtu vanitarO I vELa
అనుపల్లవి anupallaviపొలతిరో మా మువ్వ గోపాల రాయడు చలము చేసినాడుpolatirO mA muvva gOpAla rAyaDu chalamu chEsinADu
చరణం
charaNam 1
చలువ గంధము నిరుల సరము లేలేపొమ్ము లేలే
సాలపైన మీ సొగసు జూచే వారెవ్వరే
చెలియరో సేడది చెప్ప సక్కెము గాదు
వలపైన యీ పాపము వద్దే పగ వారికైన
chaluva gandhamu nirula saramu lElEpommu lElE
sAlapaina mI sogasu jUchE vArevvarE
cheliyarO sEDadi cheppa sakkemu gAdu
valapaina yI pApamu vaddE paga vArikaina
చరణం
charaNam 2
చిలుక తేజీ పైనెక్కి చెలరేగి యెదురెక్కి
విలు గుణ ధ్వని చేసి విరి శరము బూని
కులుకు గుబ్బల నడుమ గురి జూచు చున్నాడే
అలరు విల్తుని బారి నార్చే వారెవ్వరిక
chiluka tEjI painekki chelarEgi yedurekki
vilu guNa dhvani chEsi viri Saramu bUni
kuluku gubbala naDuma guri jUchu chunnADE
alaru viltuni bAri nArchE vArevvarika
చరణం
charaNam 3
సరసకు రాడాయె సరి ప్రొద్దు వేళాయె
విరహము మెండాయే వెన్నెల కాకాయె
మరుని కేళిలో నన్ను మువ్వ గోపాలుడు
సరసముతో పెనగి చౌక చేసినాడిక
sarasaku rADAye sari proddu vELAye
virahamu menDAyE vennela kAkAye
maruni kELilO nannu muvva gOpAluDu
sarasamutO penagi chouka chEsinADika

Leave a comment