| Title | సామికి సరి | sAmiki sari |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామికి సరి ఎవ్వరి నా చక్కని | sAmiki sari evvari nA chakkani |
| అనుపల్లవి anupallavi | భామరో తిరువళ్ళూరి వీర రాఘవ | bhAmarO tiruvaLLUri vIra rAghava |
| చరణం charaNam 1 | నెలతరో యెప్పుడైన నేనె చెక్కిలి జీరి కలగి యెరుల లేకయే చెలియ జీరెనంట తెలుగు కొమ్మను గాని యలగి మారు బలుకక చలి యించని నిండు కుండ వలె నుండునమ్మ | nelatarO yeppuDaina nEne chekkili jIri kalagi yerula lEkayE cheliya jIrenanTa telugu kommanu gAni yalagi mAru balukaka chali yinchani ninDu kunDa vale nunDunamma |
| చరణం charaNam 2 | కదసి నేనే వాని గంటి చేసి మరపున వదరి యీ లాగుననే పడతి యుంచెనందునె ఆదరిన కోపగించిన అలసిన సొలసిన మదిరాక్షి రాచిత్తము సమ్మతి బరుచు నమ్మ | kadasi nEnE vAni ganTi chEsi marapuna vadari yI lAgunanE paDati yunchenandune Adarina kOpaginchina alasina solasina madirAkshi rAchittamu sammati baruchu namma |
| చరణం charaNam 3 | భామరో మా మువ్వ గోపాలుడే వీర రాఘవుడు కాముకేళి హొయలుగ గలసి యుండగ ఏ మగువ వద్దనైన యీలాగుందునో యంటి ఈ మాటలెట్లంటినని యెంతో యుస్సురనెనమ్మ | bhAmarO mA muvva gOpAluDE vIra rAghavuDu kAmukELi hoyaluga galasi yunDaga E maguva vaddanaina yIlAgundunO yanTi I mATaleTlanTinani yentO yussuranenamma |