| Title | ఈ మాట | I mATa |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ఘంటారవ | ghanTArava |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఈ మాట వలన ఫలమిక నేమి కద్దు | I mATa valana phalamika nEmi kaddu |
| అనుపల్లవి anupallavi | భామరో చాలు మువ గోపాలు పొందే మనకు వద్దు | bhAmarO chAlu muva gOpAlu pondE manaku vaddu |
| చరణం charaNam 1 | వామాక్షిరో! వాడీడకు వచ్చే మనసు లేదు రామ వాడు రాదలచితే రానిచ్చేది కాదు ఏమో నాటి కాయా ఫల మింక బని లేదు నా మేలు వానిపై నింక నాటి యండగ బోతు | vAmAkshirO! vADIDaku vacchE manasu lEdu rAma vADu rAdalachitE rAnicchEdi kAdu EmO nATi kAyA phala minka bani lEdu nA mElu vAnipai ninka nATi yanDaga bOtu |
| చరణం charaNam 2 | వనజాక్షిరో! వాని కొరకై దిన దిన మీ పోరు కని విని మీరెందరైన గాదనగ లేరు చెనకి వానితో నను మోడి చేసుకొమ్మనేరు చనువు లేని చోట యింత చలమెట్ల యీడేరు | vanajAkshirO! vAni korakai dina dina mI pOru kani vini mIrendaraina gAdanaga lEru chenaki vAnitO nanu mODi chEsukommanEru chanuvu lEni chOTa yinta chalameTla yIDEru |
| చరణం charaNam 3 | ఎంత లాలించి కూడిన హితవు మాట నున్న వింత మువ్వ గోపాలుని విధములు నేవిన్న అంతరంగము శోధించి ఊలసిత నేవిన్న రంతు సేయక చిత్తము రాయి చేసుకున్న | enta lAlinchi kUDina hitavu mATa nunna vinta muvva gOpAluni vidhamulu nEvinna antarangamu SOdhinchi ualasita nEvinna rantu sEyaka chittamu rAyi chEsukunna |