1296 ఇంతిరో వరదునికి intirO varaduniki

Titleఇంతిరో వరదునికిintirO varaduniki
Written By
Book
రాగం rAgaధన్యాసిdhanyAsi
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఇంతిరో వరదునికి నీపై నెంత మోహమే
సంతతంబని వెత జూడ జాలక యిందు వచ్చితిని
intirO varaduniki nIpai nenta mOhamE
santatambani veta jUDa jAlaka yindu vacchitini
చరణం
charaNam 1
చెక్కిట చేయి చేర్చుకొనెను
చిరు నవ్వు నవ్వుకొనెను
అక్కట నే దలచినట్లే నైరాదనెను
మక్కువ మును చేసిన చెలిమి
మరపు రాదాయనెను
చక్కని ఈ చెలిని గూడని
జన్మమేటి జన్మమనెను
chekkiTa chEyi chErchukonenu
chiru navvu navvukonenu
akkaTa nE dalachinaTlE nairAdanenu
makkuva munu chEsina chelimi
marapu rAdAyanenu
chakkani I chelini gUDani
janmamETi janmamanenu
చరణం
charaNam 2
పడతి యుండుండి నేనేమి
పాపము జేసితి ననెను
తడవు నిన్నెడ బాసి
తాళ లేననెను
నడువ నోరాడదనెను
నొసట చేయించుకొనెను
అడిగితె మీరేమైన
నార్చేరో తీర్చేరో యనెను
paDati yunDunDi nEnEmi
pApamu jEsiti nanenu
taDavu ninneDa bAsi
tALa lEnanenu
naDuva nOrADadanenu
nosaTa chEyinchukonenu
aDigite mIrEmaina
nArchErO tIrchErO yanenu
చరణం
charaNam 3
పలవరించుచు మా మువ్వ
గోపాలుడైన వరదుడు
నళినాక్షి! యానాటి వింత
నడుచునో యనెను
తలచి యసురుసురు మనెను
దైవమిట్ల చేసెననెను
వలపనే పాపము పగ
వారికైన గారాదనెను (2)
palavarinchuchu mA muvva
gOpAluDaina varaduDu
naLinAkshi! yAnATi vinta
naDuchunO yanenu
talachi yasurusuru manenu
daivamiTla chEsenanenu
valapanE pApamu paga
vArikaina gArAdanenu (2)

Leave a comment