#372 వారిజాక్షి vArijAkshi

Titleవారిజాక్షిvArijAkshi
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAgaకేదారగౌళkEdAragauLa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవారిజాక్షి నా మనవిని వినవేvArijAkshi nA manavini vinavE
అనుపల్లవి anupallaviసారమైన సంసార శరధిలో
సారెకు వచ్చిన సారసవదన
sAramaina samsAra SaradhilO
sAreku vachchina sArasavadana
చరణం
charaNam 1
చిరకాలము సంతోషముగా
సరసము లాడుట కెంత వింత
స్మరతాపములను దీర్చకుండుట
సరిగాదే (నీకు) తాళవనలోలుని
chirakAlamu santOshamugA
sarasamu lADuTa kenta vinta
smaratApamulanu dIrchakunDuTa
sarigAdE (nIku) tALavanalOluni

#371 ఏమిత్తునే EmittunE

Titleఏమిత్తునేEmittunE
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookuknown
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏమిత్తునే చెలియా నీకు నేనేమిత్తునేEmittunE cheliyA nIku nEnEmittunE
అనుపల్లవి anupallaviకామిని నీతో నేనేమేమో జేసిన
సామి నీవే గతియని నాతో వచ్చిన నీకేమిత్తునే
kAmini nItO nEnEmEmO jEsina
sAmi nIvE gatiyani nAtO vachchina nIkEmittunE
చరణం
charaNam 1
తాళవనుని మనవ్యాలకించి సుర
తాలన్ని జేయుట కాలంబమైతివే
చాలక కూడి ముద్దాడి మాటాడి చిర
కాలము సుఖమిచ్చే లోలాక్షి నీకు నేనేమిత్తునే
tALavanuni manavyAlakinchi sura
tAlanni jEyuTa kAlambamaitivE
chAlaka kUDi muddADi mATADi chira
kAlamu sukhamichchE lOlAkshi nIku nEnEmittunE

#370 ఏది మంచి సుఖము Edi manchi sukhamu

వైరాగ్య జావళి – vairAgya jAvaLi

Titleఏది మంచి సుఖముEdi manchi sukhamu
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAga
తాళం tALaప్రతాప శేఖరpratApa SEkhara
పల్లవి pallaviఏది మంచి సుఖము పరాత్పరా
మానవులకు సదా కాలము
Edi manchi sukhamu parAtparA
mAnavulaku sadA kAlamu
అనుపల్లవి anupallaviమోదమో వేదాంతమో స్వాంతమైన
కాముసుఖమో తెలియలేనైతిరా
mOdamO vEdAntamO svAntamaina
kAmusukhamO teliyalEnaitirA
చరణం
charaNam 1
కామము తగదనవారు కొంత కాలములో
కామ వశమయ్యెదరు
కామహరుడే కామాక్షికి ప్రియుడై
కామించినాడే తలవనాధినాధ
kAmamu tagadanavAru konta kAlamulO
kAma vaSamayyedaru
kAmaharuDE kAmAkshiki priyuDai
kAminchinADE talavanAdhinAdha

#369 వయసులంత vayasulanta

Titleవయసులంతvayasulanta
Written Byధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావుdharmapuri subbarAyar / subbArAvu
Book
రాగం rAgaద్విజావంతిdvijAvanti
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviవయసులంత పనికి రాదుగదరా
భయము లేనివాడే పురుషుడు
vayasulanta paniki rAdugadarA
bhayamu lEnivADE purushuDu
అనుపల్లవి anupallaviచిరుత ప్రాయముండగ మంచి
చిరునవ్వు లేనివానికి
chiruta prAyamunDaga manchi
chirunavvu lEnivAniki
చరణం
charaNam 1
మనసుంటే తనువు తిరుగును మొరుగును
మనసుండేవాడు మానవుడు
మనసులేక తనువు దెంచితె
ఘనము కాదు ధరపురీశ
manasunTE tanuvu tirugunu morugunu
manasunDEvADu mAnavuDu
manasulEka tanuvu denchite
ghanamu kAdu dharapurISa

#368 ఔరరా భళిరా aurarA bhaLirA

Titleఔరరా భళిరాaurarA bhaLirA
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAgaకాపిkApi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఔరరా భళిరా రాజకుమారా
తీరని మోహమిదేరా తామసించకురా
aurarA bhaLirA rAjakumArA
tIrani mOhamidErA tAmasinchakurA
చరణం
charaNam 1
తీయని మాటలతో సుయనే మారుతములో
పయ్యద రా స్వైర విహారము
చయ్యని కాలము వ్యర్థము గదరా
సయ్యాట పాటలకు సమయమిదేర
tIyani mATalatO suyanE mArutamulO
payyada rA svaira vihAramu
chayyani kAlamu vyarthamu gadarA
sayyATa pATalaku samayamidEra
చరణం
charaNam 2
ఊగుమా రాగముతో ఉయ్యల
బాగుగా నుండుటకు బాధలా
జాగుసేయక వేవేగము నన్నేలు
ఈ గతి సుదతికి తాళవనేశుడ
UgumA rAgamutO uyyala
bAgugA nunDuTaku bAdhalA
jAgusEyaka vEvEgamu nannElu
I gati sudatiki tALavanESuDa

#367 సరసకు బిగువేలే sarasaku biguvElE

Titleసరసకు బిగువేలేsarasaku biguvElE
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Book
రాగం rAgaకాంబోదిkAmbOdi
తాళం tALaచారులీలchArulIla
పల్లవి pallaviసరసకు బిగువేలే ఓ చెలియా
sarasaku biguvElE O cheliyA
పలుకవేల బాలా నిన్నే ప్రేమించితి చాలా
తాళజాల కోపమేల
palukavEla bAlA ninnE prEminchiti chAlA
tALajAla kOpamEla
విరిశరములు నాదురమున చిక్కి నేనొందితినే
వెత జెందితినే నిను జూచితినే నాతో
viriSaramulu nAduramuna chikki nEnonditinE
veta jenditinE ninu jUchitinE nAtO
ప్రేమించేవారు భయములు వీడ
ఏమైనగాని మనసు నెంచరాదు
చామభూపాలుడు నాకిపుడు సామియంటినే
నిను నేడు గంటినే నాదు యింటికే జరుగే
prEminchEvAru bhayamulu vIDa
EmainagAni manasu nencharAdu
chAmabhUpAluDu nAkipuDu sAmiyanTinE
ninu nEDu ganTinE nAdu yinTikE jarugE

#366 సఖియ నేనెందుబోదు sakhiya nEnendubOdu

Titleసఖియ నేనెందుబోదుsakhiya nEnendubOdu
Written Byచామ రాజేంద్ర వడయారుchAma rAjEndra vaDayAru
Bookunknown
రాగం rAgaదర్బారీ కానడdarbArI kAnaDa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసఖియా నేనెందు బోదుమిక నా మనసు నీదైనదిsakhiyA nEnendu bOdumika nA manasu nIdainadi
చరణం
charaNam 1
కపట నాటక మెరుగని వాడే
చపలాక్షుడు నేను కాదే
kapaTa nATaka merugani vADE
chapalAkshuDu nEnu kAdE
చరణం
charaNam 2
అసమ సుందరి నీ చిరు నవ్వులకు
కుసుమశరుడు విరిశరములు వేయ
asama sundari nI chiru navvulaku
kusumaSaruDu viriSaramulu vEya
చరణం
charaNam 3
కోమలాంగుడౌ చామభూపాలుడు నే
కామిని నిన్నిపుడు కామించితి
kOmalAnguDau chAmabhUpAluDu nE
kAmini ninnipuDu kAminchiti

#365 పంపవే pampavE

TitleపంపవేpampavE
Written Byనవసాలపురి తిప్పనార్యnavasAlapuri tippanArya
Bookunknown
రాగం rAgaజోన్‌పురిjOn^puri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviపంపవే నావారిని బైట
సొంపుగ సుఖమిచ్చి దాచుకున్నావేల
pampavE nAvArini baiTa
sompuga sukhamichchi dAchukunnAvEla
పతియని అడిగినన గాలించితె వారు
రతి దీర్చుటకు నీకిత్తురె
మతిమంతులీ పతిత కార్యములను స
మ్మతిని జేయుదురే పతివ్రత నేను
patiyani aDiginana gAlinchite vAru
rati dIrchuTaku nIkitture
matimantulI patita kAryamulanu sa
mmatini jEyudurE pativrata nEnu
అప్పుల దీర్చుటకని వచ్చిన నా పథకము
మెప్పుగ నీ గళములో నున్నదేల
రెప్పవలె గాచిన పతిదేవునకి
తప్పక మందుబెట్టినావో
appula dIrchuTakani vachchina nA pathakamu
meppuga nI gaLamulO nunnadEla
reppavale gAchina patidEvunaki
tappaka mandubeTTinAvO
లేదంటే విడువను నావారు
ఏదో తెలియక నీలో దూరినారు
మేదినిలో సతుల నొప్పించరాదు
ఖాద్రి పురీశు డంతటి వారు నావారు
lEdanTE viDuvanu nAvAru
EdO teliyaka nIlO dUrinAru
mEdinilO satula noppincharAdu
khAdri purISu DantaTi vAru nAvAru
Audio Linkhttps://www.youtube.com/watch?v=dIJdvRddgIo

#364 అందరు ఒకటే andaru okaTE

Titleఅందరు ఒకటేandaru okaTE
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookunknown
రాగం rAgaఆనందభైరవిAnandabhairavi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఅందరు ఒకటే ఈ మగవారులందరుandaru okaTE I magavArulandaru
చందురుని చూపించి మా
అందము ఆస్వాదించి మే
మిందులో మునిగినపుడు ఏ
సందులలో దూరెళ్ళదరు
chanduruni chUpinchi mA
andamu AsvAdinchi mE
mindulO muniginapuDu E
sandulalO dUreLLadaru
మాటలలో వెన్న పూసి
నాటకముగ నెడబాసి
పాటలు పాడించి పడి
పాటలు చేసి పయ్యెదరు
mATalalO venna pUsi
nATakamuga neDabAsi
pATalu pADinchi paDi
pATalu chEsi payyedaru
ఏ విధముగ నమ్మరాదు
నమ్మితే వచ్చేదీ రాదు
భావుక తాళవనాధీశుని దప్ప
ఎల్లరు ఇలలో ఇటువంటి వారే
E vidhamuga nammarAdu
nammitE vachchEdI rAdu
bhAvuka tALavanAdhISuni dappa
ellaru ilalO iTuvanTi vArE

#363 వంచన శాయకురా vanchana SAyakurA

Titleవంచన శాయకురాvanchana SAyakurA
Written Byunknown
Bookunknown
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవంచన శాయకురా ఇది
మంచిది కాదురా కుంజరగమన
vanchana SAyakurA idi
manchidi kAdurA kunjaragamana
అనుపల్లవి anupallaviఎంచి వరహాల సంచిని జూపించి
మంచిగ మంచముపై నను మర్దించితివిక
enchi varahAla sanchini jUpinchi
manchiga manchamupai nanu mardinchitivika
చరణం
charaNam 1
సానులకు స్వానుభవము వద్దురా
కానులకే మాకు కాన్చురా
దినమంతా నా తనువును సుఖించి
ధనమేలనని నిన్ను ఎట్లు విడువనురా
sAnulaku svAnubhavamu vaddurA
kAnulakE mAku kAn&churA
dinamantA nA tanuvunu sukhinchi
dhanamElanani ninnu eTlu viDuvanurA