Title | మరుబారికి | marubAriki |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | మాంజి | mAnji |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | మరుబారికి తాళగలేనె యీ | marubAriki tALagalEne yI |
స్మరమోహన సుందరు బాసి యేమె యీ | smaramOhana sumdaru bAsi yEme yI | |
చరణం charaNam 1 | తమి నాటిన చిత్తము నెంచుచు యీ శ్రమ నెంతయు నా కమలాగ్రణితో సమయమరసిటు దెల్పవే కృప సల్పవే కామినీమణి సామిలేక యామినీ నేనేమిసేయుదు | tami nATina chittamu nemchuchu yI Srama nemtayu nA kamalAgraNitO samayamarasiTu delpavE kRpa salpavE kAminImaNi sAmilEka yAminI nEnEmisEyudu |
చరణం charaNam 2 | మదిరాక్షిరో శ్రీ హృదయేశుడు నా సదనంబునకేగుదు రాయని యే సుదతి బోధన జేసెనో మది రోసెనో సదయుడయిన నన్ గదయున రేనిదుర లేకే నెదురు జూచితి | madirAkshirO SrI hRdayESuDu nA sadanambunakEgudu rAyani yE sudati bOdhana jEsenO madi rOsenO sadayuDayina nan gadayuna rEnidura lEkE neduru jUchiti |
చరణం charaNam 3 | మలయాద్రి తటి నిలయా నిలుచే కలకాలము నీ గతి జెందితినే దలచి నను కృప లాదటే బల్‌వాదటే బాలరో గోపాలచంద్రుని కేళిలోనే వాలలాడితి | malayAdri taTi nilayA niluchE kalakAlamu nI gati jemditinE dalachi nanu kRpa lAdaTE bal^vAdaTE bAlarO gOpAlachamdruni kELilOnE vAlalADiti |
[…] 163 […]
LikeLike