This is the first jAvaLi from this book
Title | ఏటీకె యీ తగవు | ETIke yI tagavu |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | భయిరవి | bhayiravi |
తాళం tALa | త్రిపుట | tripuTa |
1 | ఏటీకె యీ తగవు మాటిమాటికి నాతో సాటివారు గేలి సలుపాగనూ బోటీరొ నా ప్రియుని మాటాలు వింటివె నీటీపై వ్రాతాయె నేనేమి సేతూ | ETIke yI tagavu mATimATiki nAtO sATivAru gEli salupAganU bOTIro nA priyuni mATAlu vinTive nITIpai vrAtAye nEnEmi sEtU |
2 | అక్కార దీర్చి నన్నాదరింతు నాని చెక్కిలిబట్టి తాజేసిన బాస రొక్కాపు మూటాయె లోకాపవాదాయె యెక్కడి స్నేహ మింకెక్కడి ప్రేమా | akkAra dIrchi nannAdarimtu nAni chekkilibaTTi tAjEsina bAsa rokkApu mUTAye lOkApavAdAye yekkaDi snEha mimkekkaDi prEmA |
3 | తుంటవింటివాడు తూపూలు నా యెద జంటనేయ సైచజాలానితరిని కంటబడని వాని కాపురమిక నేలా రెంటా జెడిన నావంటిదిలగలదా | tumTavimTivADu tUpUlu nA yeda jamTanEya saichajAlAnitarini kamTabaDani vAni kApuramika nElA remTA jeDina nAvamTidilagaladA |
4 | రాజా వేంకట రామారాయ భూపాలుడు భోజరాజ రాజరాజ నిభుడనియా రాజీవాయతనేత్రి రాయబారము సేయ యాజీవమని నమ్మినందుల కిటులాయెనే | rAjA vEmkaTa rAmArAya bhUpAluDu bhOjarAja rAjarAja nibhuDaniyA rAjIvAyatanEtri rAyabAramu sEya yAjIvamani namminamdula kiTulAyenE |