Title | యేమి జేతునే చెలియ | yEmi jEtunE cheliya |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | సురట | suraTa |
తాళం tALa | ఏక | Eka |
1 | యేమిజేతునే చెలియ యేమని దెలుపుదు సామి యెంతో మోసాబుచ్చెనే | yEmijEtunE cheliya yEmani delupudu sAmi yemtO mOsAbuchchenE |
2 | కామునికేళిని గలసిన దాకా వేమరు బాసలెల్ల వింతగ జేసి కోమలి వింటివే గుట్టు బయలుబెట్టినహా | kAmunikELini galasina dAkA vEmaru bAsalella vimtaga jEsi kOmali vimTivE guTTu bayalubeTTinahA |
3 | చక్కగ బల్కుచు సరసను జేర్చి చెక్కిలి నొక్కి యెన్నొ చేష్టలుజేసి అక్కర దీర్చి నన్నరమర జేసునే సామి | chakkaga balkuchu sarasanu jErchi chekkili nokki yenno chEshTalujEsi akkara dIrchi nannaramara jEsunE sAmi |
4 | రాజా వెంకట రామరాయా భూపతి యేరామనుగూడి యిటురాక యుండెనే యో జలజాక్షి నా యోగ మెటులుండినదొ | rAjA vemkaTa rAmarAyA bhUpati yErAmanugUDi yiTurAka yumDenE yO jalajAkshi nA yOga meTulunDinado |