| Title | తరుణిరో యినుగంటి | taruNirO yinugamTi |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| 1 | తరుణిరో యినుగంటి తమ్మయ్య వసుంధరా వరునిపై నలుక వలదు రావే వేగము | taruNirO yinugamTi tammayya vasumdharA varunipai naluka valadu rAvE vEgamu |
| 2 | కంతుని నలు నిజయంతుని సొముని వసంతుని నేలిన యెంతో సుందరుడే | kamtuni nalu nijayamtuni somuni vasamtuni nElina yemtO sumdaruDE |
| 3 | వితరణమున ఘనుడె విభవమున యింద్రుడె చతురత యందున చక్రాయుధ ధరుడె | vitaraNamuna ghanuDe vibhavamuna yimdruDe chaturata yamduna chakrAyudha dharuDe |
| 4 | మారుని యాలమున కూరిమిని నాధుడో కోరి తావులంటిన నేరముగాదు సుమ్మ | mAruni yAlamuna kUrimini nAdhuDO kOri tAvulamTina nEramugAdu summa |