| Title | వనజాక్షుని బాయలేనే | vanajAkshuni bAyalEnE |
| Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
| Book | SRmgAra jAvaLLu | |
| రాగం rAga | హిందుస్తానీ కాఫీ | hindustAnI kAfI |
| తాళం tALa | ఆది | Adi |
| 1 | వనజాక్షుని బాయలేనే సఖీ | vanajAkshuni bAyalEnE sakhI |
| 2 | వెనుకనె వచ్చి నా కనుదోయిని మూసి తను నన్నెఱుంగమన్నాడే | venukane vachchi nA kanudOyini mUsi tanu nanne~rungamannADE |
| 3 | కడు ముద్దు పాటల గరగించి నన్ను తన తొడపైని నుంచుకొన్నాడే | kaDu muddu pATala garagimchi nannu tana toDapaini nunchukonnADE |
| 4 | మమతమీర నాతో మనసిచ్చి మాటాడుచు తమలంబు నొసంగినాడే | mamatamIra nAtO manasichchi mATADuchu tamalambu nosamginADE |
| 5 | ఘన సన్నిభాంగుడే గబ్బిట యజ్ఞన్న హృద్వనజ ప్రపూజితాంగుడే | ghana sannibhAmguDE gabbiTa yajnanna hRdvanaja prapUjitAmguDE |