Title | ఇంత వేగపడిన | imta vEgapaDina |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | కమాచి | kamAchi |
తాళం tALa | రూపక | rUpaka |
1 | ఇంత వేగపడిన కార్యమెట్టులౌనురా రవంతవేళజూచి ముద్దులాడ దగునురా | imta vEgapaDina kAryameTTulaunurA ravamtavELajUchi muddulADa dagunurA |
2 | మెత్తని పానుపున మగని మెల్లనె నిద్రింపజేసి యత్తమామ లెఱుగకుండ వత్తును పోరా | mettani pAnupuna magani mellane nidrimpajEsi yattamAma le~rugakunDa vattunu pOrA |
3 | మరదులు గ్రామాంతరమ్ములరిగి రాడబిడ్డలింక పొరుగిండ్లకు నాటలాడబోదురు గదరా | maradulu grAmAmtarammularigi rADabiDDalimka porugimDlaku nATalADabOduru gadarA |
4 | దాపున మా పూలదోట లోపల నీవుండుము గడెసేపులోనె బాగాల్ గొని చేరవత్తురా | dApuna mA pUladOTa lOpala nIvumDumu gaDesEpulOne bAgAl goni chEravatturA |
5 | చెన్ను మీర గబ్బిట యజ్ఞన్న కవి నేలినట్టి చిన్ని కృష్ణ మదిని నేర మెన్నబోకురా | chennu mIra gabbiTa yajnanna kavi nElinaTTi chinni kRshNa madini nEra mennabOkurA |
[…] ఇంత వేగపడిన రాగం కమాచి తాళం రూపక […]
LikeLike