Title | కోపమేలరా | kOpamElarA |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | కోపమేలరా నాపైని నా మనోహరా ఆపరాని మోహ విరహ తాప మందుచుంటిరా ఇంత కోపమేలరా | kOpamElarA nApaini nA manOharA AparAni mOha viraha tApa manduchunTirA inta kOpamElarA |
చరణం charaNam 1 | సంతతంబు నిన్నె కోరి చెంత చేరి యుంటిరా వింత కౌగిలింతతో మరింత వలపుమించెరా యింత | samtatambu ninne kOri chemta chEri yunTirA vimta kaugilimtatO marinta valapumincherA yimta |
చరణం charaNam 2 | హెవెన్ మన్యు నుండి నీకు లెటర్స్ బంపగా నెవర్ మైండ్ లవర్ ఫ్రెండ్‌ని యువర్ విల్‌గాగ వయు రావైతివి | heven manyu numDi nIku leTars bampagA nevar mainD lavar frenD^ni yuvar vil^gAga vayu rAvaitivi |
చరణం charaNam 3 | పొదన్ పొదన్ గదల్చి తుమ్మెదల్ రొదల్ మొదల్పగా మొదల్ మరుండెదన్ శరాల్ గుదుల్ గుదుల్ గుదుల్ గదున్చెరా | podan podan gadalchi tummedal rodal modalpagA modal marunDedan SarAl gudul gudul gudul gadun&cherA |
చరణం charaNam 4 | ఆస బాస జేసి యీని రాస నీ విలాసమా కేశవా ద్విభాషి పుల్లకవీశ మద్వికాసమా | Asa bAsa jEsi yIni rAsa nI vilAsamA kESavA dvibhAshi pullakavISa madvikAsamA |