Title | మొట్టమొదట | moTTamodaTa |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | మొట్టమొదలు నట్టనడుము తుట్టతుదయు నెరుగనే యిట్టె వచ్చి విభుడు రాత్రి యేమి పనులు జేసెనో | moTTamodalu naTTanaDumu tuTTatudayu neruganE yiTTe vachchi vibhuDu rAtri yEmi panulu jEsenO |
చరణం charaNam 1 | మోము మోము గదియ విభుడు ముద్దు పెట్టినంతలో భామ యేమొ కాని నేను పరవశమై యుంటినే | mOmu mOmu gadiya vibhuDu muddu peTTinamtalO bhAma yEmo kAni nEnu paravaSamai yunTinE |
చరణం charaNam 2 | అట్టె విభుడు చన్నుదోయి బట్టి వచ్చినంతనే యెట్టి మాయయేమొ నాదు హృదయమైక్య మాయెనే | aTTe vibhuDu channudOyi baTTi vachchinamtanE yeTTi mAyayEmo nAdu hRdayamaikya mAyenE |
చరణం charaNam 3 | భాసుర శ్రీ వేణుగోప బాలుడంతటి నంతనే దాసురామదాస చిత్త వాసి యనుకొంటినే | bhAsura SrI vENugOpa bAluDamtaTi nantanE dAsurAmadAsa chitta vAsi yanukonTinE |