#390 సామి నీపై sAmi nIpai

Titleసామి నీపైsAmi nIpai
Written Byరామనాథపురం శ్రీనివాస అయ్యంగార్rAmanAthapuram SrInivAsa ayyangAr
Book
రాగం rAgaనవరత్న జావళిnavaratna jAvaLi
తాళం tALaరూపకrUpaka
** సరసాంగి **
సామి నీపై ఆ సరసాంగియు చాల మరులు గొన్నదిరా
ఆరడము మనసున గల ఆతురత తెలియవలసిన
సారశాస్త్రారుడ మదన శాస్త్రములను నెర చదివెను
** sarasAngi **
sAmi nIpai A sarasAngiyu chAla marulu gonnadirA
AraDamu manasuna gala Aturata teliyavalasina
sAraSAstrAruDa madana SAstramulanu nera chadivenu
** సావేరి **
ఏమి జేయుదునని మనసా వేడితి సావేడి
ఎల్లప్పుడును చింతించుచున్నదిరా
మంచి వితరణ గలది యని యెంచి
సరగున నాపై నెనరుంచి సదనము కొరకు
జని బిగి కౌగలించగ యుంటి
** sAvEri **
Emi jEyudunani manasA vEDiti sAvEDi
ellappuDunu chintinchuchunnadirA
manchi vitaraNa galadi yani yenchi
saraguna nApai nenarunchi sadanamu koraku
jani bigi kaugalinchaga yunTi
** నవరోజు **
నా మనవిని విని నీ వచ్చితివని
నవరోజు నిన్ను కొనియాడునురా
తామసమికను సలుపుట నీకు తగదురా
అలవాని దాతలకు సరియైన ప్రమాప్తుడని నిను మొరలిడ
** navarOju **
nA manavini vini nI vachchitivani
navarOju ninnu koniyADunurA
tAmasamikanu salupuTa nIku tagadurA
alavAni dAtalaku sariyaina pramAptuDani ninu moraliDa
** లలిత **
తామర సాక్షి నీ లలితాకారమును
తగ జూచుటకు ప్రీతియు గలదిరా
గారాబముతో పదముల తిరుగ
గొలుచుటకు దురాగ్రహము నిరాకరించి
బిరాన జూప వరాలొసగు
** lalita **
tAmara sAkshi nI lalitAkAramunu
taga jUchuTaku prItiyu galadirA
gArAbamutO padamula tiruga
goluchuTaku durAgrahamu nirAkarinchi
birAna jUpa varAlosagu
** వరాళి **
ప్రేమతో వరాళియని నిన్ను పిలచి
నీ వద్ద బొమ్మ నేనురా
కౄరమగు విరి శరముల సారెకును
యెదపై కురియగ వారిజముఖి
వలపు మిగుల మీరి నిను కలయుటకు అది
** varALi **
prEmatO varALiyani ninnu pilachi
nI vadda bomma nEnurA
kRUramagu viri Saramula sArekunu
yedapai kuriyaga vArijamukhi
valapu migula mIri ninu kalayuTaku adi
** ఆరభి **
భామకు నీ భ్రమచే మనసార
బిలువలేదని చెప్పుచున్నదిరా
గానరసిక శిఖామణి యును యశముగల నీకు
సరిసమాన మెవరు లేదనుచును ఆననము గానవలె నను
** Arabhi **
bhAmaku nI bhramachE manasAra
biluvalEdani cheppuchunnadirA
gAnarasika SikhAmaNi yunu yaSamugala nIku
sarisamAna mevaru lEdanuchunu Ananamu gAnavale nanu
** ఖమాసు **
వేమరు దాట చేయక మా సుందరి యొక్క
వెత దీర్చుట కిదే సమయమురా
దాని గుణము తెలుప వశమా పరమ పురుష
వరస దానిను మదిలోన దలచు
దానిపై నరమర విని
** khamAsu **
vEmaru dATa chEyaka mA sundari yokka
veta dIrchuTa kidE samayamurA
dAni guNamu telupa vaSamA parama purusha
varasa dAninu madilOna dalachu
dAnipai naramara vini
** భూపాల **
భువిలో వెలయు భూపాలుడని పొగడి
నీ రాక కోరి యున్నదిరా
మార జనక యల మలయ మారుతము
బహు విసరగ వెరచి కరగి
విరహాబ్ధిలో మునిగి చిరకాలమున నిను
** bhUpAla **
bhuvilO velayu bhUpAluDani pogaDi
nI rAka kOri yunnadirA
mAra janaka yala malaya mArutamu
bahu visaraga verachi karagi
virahAbdhilO munigi chirakAlamuna ninu
** శ్రీ **
కామించి దక్కిన శ్రీనివాస నిన్ను
కరుణతో అచ్చటకు రమ్మనెనురా
ఆదరువుగ సకల సుర సేవిత
పద యుగళ మృదు అధర మధుర
సరస లీల వినుత వాహుని సొగసుని
కాలమెరిగి జరుపు నెలత
ఏల పడ దగినదిరా యని
కులవర సుసమయమంచు తూలపరచక
నెలవిమ్ము నెలమెరయు సదయుడ
తమిప్రేమ తాళదురా
విబుధజన పరిపాల నిను విడచి యున్నది
మేలిమి గల నవరత్న మాలికా భరణుడైన సామి
** SrI **
kAminchi dakkina SrInivAsa ninnu
karuNatO achchaTaku rammanenurA
Adaruvuga sakala sura sEvita
pada yugaLa mRdu adhara madhura
sarasa lIla vinuta vAhuni sogasuni
kAlamerigi jarupu nelata
Ela paDa daginadirA yani
kulavara susamayamanchu tUlaparachaka
nelavimmu nelamerayu sadayuDa
tamiprEma tALadurA
vibudhajana paripAla ninu viDachi yunnadi
mElimi gala navaratna mAlikA bharaNuDaina sAmi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s