Title | పంచ బాణుడు | pancha bANuDu |
Written By | మైసూరు సదాశివరావు | maisUru sadASivarAvu |
Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
రాగం rAga | పంచ బాణ రాగమాలిక | pancha bANa rAgamAlika |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ** తోడి ** పంచ బాణుడు నాపై వెడలినాడు ఇంక కొంచమైన సైరించుట వశమా | ** tODi ** pancha bANuDu nApai veDalinADu inka konchamaina sairinchuTa vaSamA |
అనుపల్లవి anupallavi | నన్ను తోడికొని సరసమాడుటకు కన్నడ సేయుట నీకు తగునా | nannu tODikoni sarasamADuTaku kannaDa sEyuTa nIku tagunA |
చరణం charaNam 1 | తుమ్మెదలు మ్రోయగ కోకిలలు అమ్మరో కూయగ చిలుకలు కలకలమని పలుకగ చెంత చేరి నను చెలిమి జేసి గారవించి కౌగలించి వెతల దీర్చర సరిగాదు మౌనము సారసాక్ష | tummedalu mrOyaga kOkilalu ammarO kUyaga chilukalu kalakalamani palukaga chenta chEri nanu chelimi jEsi gAravinchi kaugalinchi vetala dIrchara sarigAdu maunamu sArasAksha |
చరణం charaNam 2 | ** అభోగి ** మదన బాధల దీర్చర రారా కమల వదన సుందరా భోగసదన మధురమైన నీ పలుకుల అమృతము సుదతీ మణి కిచ్చి దయ యుంచరా | ** abhOgi ** madana bAdhala dIrchara rArA kamala vadana sundarA bhOgasadana madhuramaina nI palukula amRtamu sudatI maNi kichchi daya yuncharA |
చరణం charaNam 3 | ** శంకరాభరణం ** అని శంకరాభరణముతో వెలగె ఘనమైన నీ కర పరిఘములో పట్టి నన్ను విడువరాదని వేడిన వట్టి పంతము జేసేవేలరా | ** SankarAbharaNam ** ani SankarAbharaNamutO velage ghanamaina nI kara parighamulO paTTi nannu viDuvarAdani vEDina vaTTi pantamu jEsEvElarA |
చరణం charaNam 4 | ** కాంభోజి ** సరసిజాస్త్రుని బాధ ఇక తాళజాల రారా కృష్ణ భూపాల విరహ దాయ కాంభోజ వైరిని పరిహాసము చాల నరవర తామసమేల | ** kAmbhOji ** sarasijAstruni bAdha ika tALajAla rArA kRshNa bhUpAla viraha dAya kAmbhOja vairini parihAsamu chAla naravara tAmasamEla |
చరణం charaNam 5 | ** సహన ** శాన వయ్యారము జేసిన అతి మౌనముతో శ్రీ సదాశివుని ధ్యానములో నుండె నిను కదలించుట కామునికూ ఇంక సాధ్యమా | ** sahana ** SAna vayyAramu jEsina ati maunamutO SrI sadASivuni dhyAnamulO nunDe ninu kadalinchuTa kAmunikU inka sAdhyamA |
Audio Link | https://www.youtube.com/watch?v=M3-eTbf_kkw |