Title | ఓ చెలియా | O cheliyA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | తిశ్ర లఘువు | tiSra laghuvu |
పల్లవి pallavi | ఓ చెలియా యీ విరహమెట్లు సైరింతునే చెలువుడు దయలేక నాతో పలుక రాడాయనే | O cheliyA yI virahameTlu sairintunE cheluvuDu dayalEka nAtO paluka rADAyanE |
చరణం charaNam 1 | మగువ యెవతో నా విభుని మరులు కొలిపెనే ఎంతో మాయ చేసెనే సఖీ పగలు రేయి నిదుర లేక పలవించుటాయెనే | maguva yevatO nA vibhuni marulu kolipenE entO mAya chEsenE sakhI pagalu rEyi nidura lEka palavinchuTAyenE |
చరణం charaNam 2 | కమల వైరి కాకలకే కంది యుండగ నే దిగులొంది యుండగా సఖీ సమయమిదే యని మరుడు శరము లేయసాగెనే | kamala vairi kAkalakE kandi yunDaga nE digulondi yunDagA sakhI samayamidE yani maruDu Saramu lEyasAgenE |
చరణం charaNam 3 | రాజగోపాలు డెపుడు రమణ నేలునే నన్నెపుడు రమణ నేలునె ఈ వగపెపుడు మానునే సఖీ ఈ జగాన వాని సాటి ఎందు జూడ గాననే | rAjagOpAlu DepuDu ramaNa nElunE nannepuDu ramaNa nElune I vagapepuDu mAnunE sakhI I jagAna vAni sATi endu jUDa gAnanE |