Title | ఏలా మా రమణిపై | ElA mA ramaNipai |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కేదార గౌళ | kEdAra gauLa |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏలా మా రమణిపై చలము నీకిది మేర గాదుర సామి వినరా | ElA mA ramaNipai chalamu nIkidi mEra gAdura sAmi vinarA |
చరణం charaNam 1 | చాలా మరుని సుమ శరావళికి నది పాలాయె దయ గనుగొనరా ఈ లీల జాగొనరించుట నీకిది | chAlA maruni suma SarAvaLiki nadi pAlAye daya ganugonarA I lIla jAgonarinchuTa nIkidi |
చరణం charaNam 2 | పరాకు సలుపకు సరోజ ముఖిపై విరాళి కోర్వదు గదరా నిరాదరణ చేయుటే బిరుద ఇది | parAku salupaku sarOja mukhipai virALi kOrvadu gadarA nirAdaraNa chEyuTE biruda idi |
చరణం charaNam 3 | ఎన్నో విధములను హితవు దెలిపినను అన్నాదులను వదలెనురా మన్నింపవేర రాజగోపాల ఇది నీకు | ennO vidhamulanu hitavu delipinanu annAdulanu vadalenurA mannimpavEra rAjagOpAla idi nIku |