Title | సామి నెడబాసి | sAmi neDabAsi |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | దేవమనోహరి | dEvamanOhari |
తాళం tALa | చాపు | chApu |
Previously posted | 377 | |
పల్లవి pallavi | సామి నెడబాసి నేనెట్టు సైరింతునే కోమలి శ్రీ రాజ గోపాల | sAmi neDabAsi nEneTTu sairintunE kOmali SrI rAja gOpAla |
చరణం charaNam 1 | మరుడురమున విరి శరముల నేసెనే సరసిజాక్షి ఇదే సమయము రమ్మనవే | maruDuramuna viri Saramula nEsenE sarasijAkshi idE samayamu rammanavE |
చరణం charaNam 2 | కలువల దొర పగ నాపై గావించెనే కలికిరో తమి నిలుప నా తరమటే | kaluvala dora paga nApai gAvinchenE kalikirO tami nilupa nA taramaTE |
చరణం charaNam 3 | శింగర నుతుడు మోసము జేసెగదే అంగనా మణి ఇపుడైనను బిలువవే | Singara nutuDu mOsamu jEsegadE anganA maNi ipuDainanu biluvavE |