Title | మాయలాడి బోధనచే | mAyalADi bOdhanachE |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | మిశ్ర లఘువు | miSra laghuvu |
Previously posted at | 37, 193 | |
పల్లవి pallavi | మాయలాడి బోధనచే మైమఱచితి వేమో మాటలాడ రావదేమిరా | mAyalADi bOdhanachE maima~rachiti vEmO mATalADa rAvadEmirA |
చరణం charaNam 1 | కాయజు బారికి తాళగా లేరా కౌగిట జేర్చి నను గారవించరా న్యాయమటర నీకిది తగదుర సరగున | kAyaju bAriki tALagA lErA kaugiTa jErchi nanu gAravincharA nyAyamaTara nIkidi tagadura saraguna |
చరణం charaNam 2 | కలకాలము నన్ను గాసి బెట్టకురా కాంతల నేచుట కార్యము గాదుర చెలువుడ వని నిను నేఱ నమ్మినందు కిక | kalakAlamu nannu gAsi beTTakurA kAntala nEchuTa kAryamu gAdura cheluvuDa vani ninu nE~ra namminandu kika |
చరణం charaNam 3 | సరివారిలో నను చౌక సేయకురా చాల నమ్మితి రతి కేళిని గూడరా వరదుడౌ మువ్వపురి నిలయుడ చనువున | sarivArilO nanu chauka sEyakurA chAla nammiti rati kELini gUDarA varaduDau muvvapuri nilayuDa chanuvuna |