Title | వేళ యిదేగానా | vELa yidEgAnA |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వేళ యిదేగానా వేగరావే జాణా | vELa yidEgAnA vEgarAvE jANA |
అనుపల్లవి anupallavi | తాళజాల లేను తడవు శేయగాను | tALajAla lEnu taDavu SEyagAnu |
చరణం charaNam 1 | మారుని బారి మరిమారి మీరి చేరితి నిన్ను కోరి జెయి జేర్చు దయ మీరి | mAruni bAri marimAri mIri chEriti ninnu kOri jeyi jErchu daya mIri |
చరణం charaNam 2 | తమకా మోర్వజాల తరుణి మణి యివ్వేళా మమత చేత చాలా మరగితినే బాలా | tamakA mOrvajAla taruNi maNi yivvELA mamata chEta chAlA maragitinE bAlA |
చరణం charaNam 3 | నిలువజాల బాలా నీమీద నీవేళా మదిగోరె చాలా మానినీ చలమేలా | niluvajAla bAlA nImIda nIvELA madigOre chAlA mAninI chalamElA |
చరణం charaNam 4 | సరసకు రావే చేరా దీసుకోవే వర నరసాపుర వాసుడనుకోవె | sarasaku rAvE chErA dIsukOvE vara narasApura vAsuDanukOve |