Title | అంతలో మాయ | antalO mAya |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | కల్యాణి | kalyANi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | అంతలో మాయ నిదుర వచ్చెనె చెలి కొంతైన మరుకేళి తమి దీరలేదే | antalO mAya nidura vachchene cheli kontaina marukELi tami dIralEdE |
అనుపల్లవి anupallavi | ఎంతెంతో లాలించి వత్తి కౌగిట జేర్చి సంతోషమున సామి కేళి సల్పిన దెరుక | ententO lAlinchi vatti kaugiTa jErchi santOshamuna sAmi kELi salpina deruka |
చరణం charaNam 1 | వరుడు నా పడకింటి కొచ్చుట గని లేచి యెదురుగ జని మ్రొక్కి వడి కౌగలించి వడిలో జేర్చుక ఆకు మడిచి యిచ్చి పానుపు నడుమ జీరి నాధుడదిమి పట్టిన వేళ | varuDu nA paDakinTi kochchuTa gani lEchi yeduruga jani mrokki vaDi kaugalinchi vaDilO jErchuka Aku maDichi yichchi pAnupu naDuma jIri nAdhuDadimi paTTina vELa |
చరణం charaNam 2 | మరుని జనకుడు నాదు మందిరమున కొచ్చి సరుగున చందోయి సవరించ గానే పరిపరి విధమూలా రంజిల్లా పటపట రవికే ముడి వీడి జారాగా | maruni janakuDu nAdu mandiramuna kochchi saruguna chandOyi savarincha gAnE paripari vidhamUlA ranjillA paTapaTa ravikE muDi vIDi jArAgA |
చరణం charaNam 3 | తమకా మగ్గల మాయె తాళాదే నామది నిమిషమేడౌచుంది నిలువ నా తరమా ఏమయిన గానిమ్ము సామిని దెమ్మాని భామరో నేనంత బంగా పోతినే చెలి | tamakA maggala mAye tALAdE nAmadi nimishamEDauchundi niluva nA taramA Emayina gAnimmu sAmini demmAni bhAmarO nEnanta bangA pOtinE cheli |
చరణం charaNam 4 | నమ్మీతి నా సామి కమ్మితి నా మేను సొమ్మూగ నేలు వెంకటస్వామి బాలుడి మ్మాహిలో మిమ్ము రమ్మాని మొరలిడ మమ్ము చేరిన మదన గోపాలుడని దెలిసి నంతలోనే మాయ నిదురా | nammIti nA sAmi kammiti nA mEnu sommUga nElu venkaTaswAmi bAluDi mmAhilO mimmu rammAni moraliDa mammu chErina madana gOpAluDani delisi nantalOnE mAya nidurA |