Title | ఈలాగున | IlAguna |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | దర్బార్ | darbAr |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఈలాగున నుండవచ్చునా ఓ నీలవేణి తాళవన లోలుని వ్యాకుల మెల్ల తెలిసి నీవిపు (డీలాగున) | IlAguna nunDavachchunA O nIlavENi tALavana lOluni vyAkula mella telisi nIvipu (DIlAguna) |
చరణం charaNam 1 | అంగనామణి నీదు భృంగ కుంతలములు కని నీ అంగ సంగ మెటు గల్గునని కుంగుచుండు నా ఇంగితం బెరింగి నన్ను కౌంగలించి నాదు తనువు ఉప్పొంగ మాటలాడి పెద్ద పంగ నామముడను దలచి | anganAmaNi nIdu bhRnga kuntalamulu kani nI anga sanga meTu galgunani kunguchunDu nA ingitam beringi nannu kaungalinchi nAdu tanuvu upponga mATalADi pedda panga nAmamuDanu dalachi |
చరణం charaNam 2 | కీరవాణి నాకై ఇంటి దూరమనుచు పేరిడి గాన కుండునటు లేమార జేయుచు చేరి నాదు శయ్యపై వెయ్యారు వగచి వెరువకనుచు ధీరతరముతో వేమారు మూరవేసి ముదము చెరచి | kIravANi nAkai inTi dUramanuchu pEriDi gAna kunDunaTu lEmAra jEyuchu chEri nAdu Sayyapai veyyAru vagachi veruvakanuchu dhIrataramutO vEmAru mUravEsi mudamu cherachi |