Title | అత్త వారూరికి | atta vArUriki |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | శహన | Sahana |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | అత్తవారూరికి అంపేరు మా వారు అయ్యయ్యో ఇకనేమి సేయుదునే | attavArUriki ampEru mA vAru ayyayyO ikanEmi sEyudunE |
అనుపల్లవి anupallavi | కత్తి కోతగాడు మగడేమి జేసునో పొత్తు మరువక యుండు పోయి వచ్చెద సామి | katti kOtagADu magaDEmi jEsunO pottu maruvaka yunDu pOyi vachcheda sAmi |
చరణం charaNam 1 | ఊరికి నే బోయి ఉన్నా యెప్పటికైన తీరినట్టు గుట్టు తెలుపకు నా సామి సారెకు మా బావ సవతి యత్త తోడ పోరాడి యెటులైన బొంకి వచ్చెద సామి | Uriki nE bOyi unnA yeppaTikaina tIrinaTTu guTTu telupaku nA sAmi sAreku mA bAva savati yatta tODa pOrADi yeTulaina bonki vachcheda sAmi |
చరణం charaNam 2 | నడిరేయి జామున నను దలచి పక్కలో ఉలికి దిగ్గున లేచి పలువరించకు సామి కులుకుగ మన యూరి పొలతులతో గూడి పడుచు తనమున నీవు వదరకుర సామి | naDirEyi jAmuna nanu dalachi pakkalO uliki digguna lEchi paluvarinchaku sAmi kulukuga mana yUri polatulatO gUDi paDuchu tanamuna nIvu vadarakura sAmi |
చరణం charaNam 3 | తిరిగిరాన నెంచకు తిరిగి వచ్చెద సామి విరజిమ్మి నా యాస విడిపింతు వేమొ గురిలేక మా మువ్వ గోపాల సామిగ మరుకేళి గూడుట మరచి పోయెద వేమొ | tirigirAna nenchaku tirigi vachcheda sAmi virajimmi nA yAsa viDipintu vEmo gurilEka mA muvva gOpAla sAmiga marukELi gUDuTa marachi pOyeda vEmo |