Title | చిన్ననాటి | chinnanATi |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | చిన్న నాటి స్నేహము మరువ వద్దుర నా ప్రియ | chinna nATi snEhamu maruva vaddura nA priya |
అనుపల్లవి anupallavi | మరువ వద్దుర నా ప్రియ నిన్ను చూడక నా మది నిలువ జాలదుర సామిగ | maruva vaddura nA priya ninnu chUDaka nA madi niluva jAladura sAmiga |
చరణం charaNam 1 | సూన శరుని జాలములకు తాళలేదుర నా మది పాపి మారుడు క్రూరుడై బల్ తాపమొందగ జేసెరా | sUna Saruni jAlamulaku tALalEdura nA madi pApi mAruDu krUruDai bal tApamondaga jEserA |
చరణం charaNam 2 | ప్రాయము నుండి నీపై చాల మరులు కొంటిర నా పైన నేరమా యేమది బల్కర సామిగ | prAyamu nunDi nIpai chAla marulu konTira nA paina nEramA yEmadi balkara sAmiga |
చరణం charaNam 3 | విరహ బాధ కోర్వ జాలక నీ మరుగున జొచ్చితి నా మనసున నొప్పించక వేగమె కలయర | viraha bAdha kOrva jAlaka nI maruguna jochchiti nA manasuna noppinchaka vEgame kalayara |
చరణం charaNam 4 | పలు విధముల రతులతో నిన్ను కలయ వలె నని మనంబు చాల తత్తర పడు చున్నదిరా | palu vidhamula ratulatO ninnu kalaya vale nani manambu chAla tattara paDu chunnadirA |