| Title | ఏమనెనె సుద్దు | Emanene suddu |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏమనెనె సుద్దు లేమనెనే! బంగారు బొమ్మ | Emanene suddu lEmanenE! bangAru bomma |
| అనుపల్లవి anupallavi | ఏమనెనే మరుగేల దాచకే రామ తుపాకుల రాయడు నీతో | EmanenE marugEla dAchakE rAma tupAkula rAyaDu nItO |
| చరణం charaNam 1 | మానిని! ముందుగా నా మాట నీవెత్తితివో తానె పలుకరించెనో దయ నాపయి గలిగి కానుక తన చేత బూనెనో యందిమ్మని యానతీవే నా మీదాన యో చెలియ | mAnini! mundugA nA mATa nIvettitivO tAne palukarinchenO daya nApayi galigi kAnuka tana chEta bUnenO yamdimmani yAnatIvE nA mIdAna yO cheliya |
| చరణం charaNam 2 | వనితరో! వాడీడకు వచ్చెననెనో లేక నను తోడి తెమ్మనెనో నా ప్రాణ విభుడు నెనరుతో మాటాడనో నేరమించెనో లేక వినుపింపు వాని మాట విన ముచ్చటయ్యేని | vanitarO! vADIDaku vacchenanenO lEka nanu tODi temmanenO nA prANa vibhuDu nenarutO mATADanO nEraminchenO lEka vinupimpu vAni mATa vina mucchaTayyEni |
| చరణం charaNam 3 | వేడుక దుపాకుల వేంకట కృష్ణుడు గూడే వేళలో నే వోడితినని నేడా సుద్దు లేమైనా నీతో మందలించెనో మోదిగా నున్నాడో ముదితరో యేమె | vEDuka dupAkula vEnkaTa kRshNuDu gUDE vELalO nE vODitinani nEDA suddu lEmainA nItO mandalinchenO mOdigA nunnADO muditarO yEme |