1288 అలగితి వెందుకు alagiti venduku

Titleఅలగితి వెందుకుalagiti venduku
Written By
Book
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి pallaviఅలగితి వెందుకు అల మువ్వ గోపాలునితో
ఆయాయపోవే
alagiti venduku ala muvva gOpAlunitO
AyAyapOvE
అనుపల్లవి anupallaviనెలతరో నీవంటి నిర్దయురాలను
యిలనెందు గాన యిది యేమి వానిపై
nelatarO nIvanTi nirdayurAlanu
yilanendu gAna yidi yEmi vAnipai
చరణం
charaNam 1
భామరో! నీ మది కేమి దెలుపుదు
కోమలాంగుడు నిన్నె కోరి యుండగను
వేమారు నీవేమొ వేడి నావనినాడు
నోము ఫలమని నొచ్చు కొన్నాడట
bhAmarO! nI madi kEmi delupudu
kOmalAnguDu ninne kOri yunDaganu
vEmAru nIvEmo vEDi nAvaninADu
nOmu phalamani nocchu konnADaTa
చరణం
charaNam 2
వలువ చక్కెర పురి నిలయుని మదిలో
వల వేసి నను వలపించ లేద
కళలూర రతి కేళి కలసిన పిమ్మట
చెలువుడ నీ పొందు చాలు పొమ్మని
valuva chakkera puri nilayuni madilO
vala vEsi nanu valapincha lEda
kaLalUra rati kELi kalasina pimmaTa
cheluvuDa nI pondu chAlu pommani
చరణం
charaNam 3
ఎనసిన వానిపై కినుక సేయుట నీకు
మనసి యెటువలె వచ్చెనె మానవతిరో
నెనరు గల దానవని నీ విభుడు యిందు రాగానే
వనజాక్షిరో వాని వలపు లారడి జేసి
enasina vAnipai kinuka sEyuTa nIku
manasi yeTuvale vacchene mAnavatirO
nenaru gala dAnavani nI vibhuDu yindu rAgAnE
vanajAkshirO vAni valapu lAraDi jEsi

Leave a comment