1295 ఇంక నిన్ను inka ninnu

Titleఇంక నిన్నుinka ninnu
Written By
Book
రాగం rAgaమోహనmOhana
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఇంక నిన్ను బోనిత్తునా – యిభరాజ వరదా
శుక వాణి చేత నీ సుద్దు లెల్ల విన్నట్లాయె
inka ninnu bOnittunA – yibharAja varadA
Suka vANi chEta nI suddu lella vinnaTlAye
చరణం
charaNam 1
నవ్వులంట యున్నావేమొ
నా పద్దు చూడు మీసారి
పువ్వు బోడుల చేత
రవ్వ సయించమాన
navvulanTa yunnAvEmo
nA paddu chUDu mIsAri
puvvu bODula chEta
ravva sayinchamAna
చరణం
charaNam 2
జవ్వన మెల్ల నీ పాలు చేసి
చాల నమ్మ యున్నందు
కెవ్వతి తోనో కూడి వచ్చి యిపుడు
లేదని బొంకేవు
javvana mella nI pAlu chEsi
chAla namma yunnandu
kevvati tOnO kUDi vacchi yipuDu
lEdani bonkEvu
చరణం
charaNam 3
పన్నుగ మువ్వ గోపాల
బాసలచ్చి నన్ను గూడి
వన్నెలాడికే లోనైన
వగలెల్ల విన్నార నేడు
pannuga muvva gOpAla
bAsalacchi nannu gUDi
vannelADikE lOnaina
vagalella vinnAra nEDu

Leave a comment