| Title | తానెట్ల నున్నాడో | tAneTla nunnADO |
| Written By | అన్నమాచార్య | annamAchArya |
| Book | ||
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | తానెట్ల నున్నాడో తరుణి వినిపించవే కానక నిను గన్న నతని గన్నట్లు నాయనే | tAneTla nunnADO taruNi vinipinchavE kAnaka ninu ganna natani gannaTlu nAyanE |
| చరణం charaNam 1 | కొంత వడి దన పేరు కోరి నాలుక దలతునే కొంత వడి దన సుద్దులు కొమ్మలచే విందునే కొంత వడి తానున్న కొలువు చిత్తరువు చూతం కొంత యీరీతి బొద్దు గడువుదునే నేను | konta vaDi dana pEru kOri nAluka dalatunE konta vaDi dana suddulu kommalachE vindunE konta vaDi tAnunna koluvu chittaruvu chUtam konta yIrIti boddu gaDuvudunE nEnu |
| చరణం charaNam 2 | మది నీర్కవేళ దన మాట దలపోతునే కదిసి యొక వేళ దన్ను గల లోన గందునే పదములనె వొక వేళ యెదురు నడతునే దనకు దుదనిట్ల దినదినము దొబ్బిదునే నేను | madi nIrkavELa dana mATa dalapOtunE kadisi yoka vELa dannu gala lOna gandunE padamulane voka vELa yeduru naDatunE danaku dudaniTla dinadinamu dobbidunE nEnu |
| చరణం charaNam 3 | నగినములు చూచుచు నే జరుపుదునే వాడ గడియ వగల దన దూరి లేఖలు వ్రాతు గొంత దడవు ఏగి నింతలో గూడె శ్రీ వేంకటేశ్వరుడు మగిది యల్లాడనపుడు మలగుపయి నిపుడూ | naginamulu chUchuchu nE jarupudunE vADa gaDiya vagala dana dUri lEkhalu vrAtu gonta daDavu Egi nintalO gUDe SrI vEnkaTESvaruDu magidi yallADanapuDu malagupayi nipuDU |
| AV Link | https://www.youtube.com/watch?v=RdUyKmV7SJ0 |