| Title | ఏమని భావింతు | Emani bhAvintu |
| Written By | అన్నమాచార్య | annamAchArya |
| Book | ||
| రాగం rAga | సామంత | sAmanta |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | ఏమని భావింతు నిన్ను నెంతని సంతోషించు శ్రీమంతుడు నన్ను దిద్దే చేతో యిది | Emani bhAvintu ninnu nentani santOshinchu SrImantuDu nannu diddE chEtO yidi |
| చరణం charaNam 1 | కాంతుడనే నెంతాడినా గక్క దలవు నీవు యెంత రాతి గుండె వాడవేమి చెప్పేది శాంతుడవో గట్టు వాయి జాణ తనమో యిట్టి మంతు కెక్కించే నా మీది మన్ననో యిది | kAntuDanE nentADinA gakka dalavu nIvu yenta rAti gunDe vADavEmi cheppEdi SAntuDavO gaTTu vAyi jANa tanamO yiTTi mantu kekkinchE nA mIdi mannanO yidi |
| చరణం charaNam 2 | దిట్టనై నేజంక్కిచితే తెమల వేయిటా నీవు యెట్టి చలపాది వాడవేమి చెప్పేది గుట్టు నీకింత గలదో గుణము చండిపడెనో గట్టిగా నన్నీడేర్చో కరుణో యిది | diTTanai nEjamkkichitE temala vEyiTA nIvu yeTTi chalapAdi vADavEmi cheppEdi guTTu nIkinta galadO guNamu chanDipaDenO gaTTigA nannIDErchO karuNO yidi |
| చరణం charaNam 3 | బిగ్గెనే గాగలించితే బెగడ వేమిటా నీవు యెగ్గుం తెంచనివాడ వేమి చెప్పేది సిగ్గరి తనమో నేడు శ్రీ వేంకటేశ నీనహ్వ కగ్గు లేకేలితివి నాకన్న వరమో యిద | biggenE gAgalinchitE begaDa vEmiTA nIvu yeggum temchanivADa vEmi cheppEdi siggari tanamO nEDu SrI vEnkaTESa nInahva kaggu lEkElitivi nAkanna varamO yida |