#95 మారుని బారికి mAruni bAriki

Titleమారుని బారికిmAruni bAriki
Written By
Book#Book1911
రాగం rAgaరం. హనుమతోడిraM. hanumatODi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
మారుని బారికి నేనీ కోరువజాలనే
కోరువ జాలనే వోరువజాలనే
mAruni bAriki nEnI kOruvajAlanE
kOruva jAlanE vOruvajAlanE
చరణం
charaNam 1
నగుచు నగుచు తన యిరుగు కఠారిని
ధగధగమెరీ సింబాబుగులు దగిలే చెలి
naguchu naguchu tana yirugu kaThArini
dhagadhagamerI simbAbugulu dagilE cheli
చరణం
charaNam 2
తుంట విలుకాడు తనూ జంట శరముల వెనువెంటనె
కుచములానంటగ నేసెగదా
tumTa vilukADu tanU jamTa Saramula venuvemTane
kuchamulAnamTaga nEsegadA
చరణం
charaNam 3
రంగెమీర శేషాద్రి శ్రీరంగదాసు నేలు సామీ
అంగజు కేళికీ కలయంగ రాడాయె సఖినిక
ramgemIra SEshAdri SrIramgadAsu nElu sAmI
amgaju kELikI kalayamga rADAye sakhinika

#94 పరవశమవు paravaSamavu

TitleపరవశమవుparavaSamavu
Written By
Book#Book1911
రాగం rAgaశింహపురి శింహేద (?) మధ్యముSiMhapuri SiMhEda (?) madhyamu
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
పరవశమవుచున్నదిరా పట్టువదలబోకరాparavaSamavuchunnadirA paTTuvadalabOkarA
అర నిముసములో పరిపూర్ణానందము బొందెదరాara nimusamulO paripUrNAnandamu bomdedarA
చరణం
charaNam 1
పశిగోలనుగాను మంచి పసకలిగిన దానరా
కసిగందెదనని నాపై కనికరమిక మానరా
paSigOlanugAnu mamchi pasakaligina dAnarA
kasigamdedanani nApai kanikaramika mAnarA
చరణం
charaNam 2
నీకు సరియగలయుదాన నేనని భావించరా
నీ కాళ్ళకు మ్రొక్కెదరా నీ నేరుపు జూపరా
nIku sariyagalayudAna nEnani bhAvimcharA
nI kALLaku mrokkedarA nI nErupu jUparA
చరణం
charaNam 3
తలపు వేరె యుంచురా తత్తరబడపోకుమురా
కలవర మొందక నిలుపుము గలయర నీ దానరా
talapu vEre yumchurA tattarabaDapOkumurA
kalavara momdaka nilupumu galayara nI dAnarA
చరణం
charaNam 4
నిరతము శ్రీ సింహాపురి నిలయ రంగేశ్వరా
సరసులలో మేటివంచు చాల సన్నుతింతురా
niratamu SrI siMhApuri nilaya ramgESwarA
sarasulalO mETi vamchu chAla sannutimturA

#93 చిన్నవయసు chinnavayasu

Titleచిన్నవయసుchinnavayasu
Written By
Book#Book1911
రాగం rAgaసింహపురి బేహాగ్siMhapuri bEhAg
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
చిన్న వయసు దానరా నే చెలిమి కోరినానురాchinna vayasu dAnarA nE chelimi kOrinAnurA
వన్నెకాడ నిన్నుజూచీ వలచి వచ్చినానురాvannekADa ninnujUchI valachi vachchinAnurA
చరణం
charaNam 1
కమ్మనీ కొత్తాపుతేనె లిమ్మనీ చవిజూడగా
తుమ్మెద వాసనజూడని తమ్మిజాడనుండరా
kammanI kottAputEne limmanI chavijUDagA
tummeda vAsanajUDani tammijADanumDarA
చరణం
charaNam 2
దొంటి మావిమంజిరికతి దోచునేమొ నెంచరా
అంటిన యా సుఖమనుభవమగు నెమ్మదించరా
donTi mAvimamjirikati dOchunEmo nemcharA
amTina yA sukhamanubhavamagu nemmadimcharA
చరణం
charaNam 3
ఈ ధర శింహాపురి రంగనాథ మా మనోహరా
సాధ నీ ముఖేందు జూచి నాకందొగలారెరా
I dhara SiMhApuri ramganAtha mA manOharA
sAdha nI mukhEmdu jUchi nAkamdogalArerA

#92 హా ప్రియా hA priyA

Titleహా ప్రియాhA priyA
Written By
Book#Book1911
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
హా ప్రియా నినుబాసి నేనే ప్రకారము సైతురాhA priyA ninubAsi nEnE prakAramu saiturA
చరణం
charaNam 1
పాపిమారుడు క్రూరుడై పరితాపమొందగ జేసెరా
పాపి బోధనలేమొ బల్ విని రాపు సేయుట న్యాయమా
pApimAruDu krUruDai paritApamomdaga jEserA
pApi bOdhanalEmo bal vini rApu sEyuTa nyAyamA
చరణం
charaNam 2
సుందరాంగుడు నన్ను గూడిన వన్నెకాడెటు బోయెరా
కన్నెరొవాడెన్నొ విధముల చిన్నబుచ్చెనె నా మది
sumdarAmguDu nannu gUDina vannekADeTu bOyerA
kannerovADenno vidhamula chinnabuchchene nA madi
చరణం
charaNam 3
నారులెల్లను గూడి నా మది నేర మేమొనరించెరా
నారసింహున పాటబాడి ఉల్లాసమొందెరా నా మది
nArulellanu gUDi nA madi nEra mEmonarimcherA
nArasiMhuna pATabADi ullAsamomderA nA madi

#91 మారసుందరా mArasumdarA

TitleమారసుందరాmArasumdarA
Written By
Book#Book1911
రాగం rAgaకమాసుkamAsu
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మారసుందరా నా నేరమేమిరా
క్రూర మనూబారిచే వేసారితి నిను కోరితి ప్రియా
mArasumdarA nA nEramEmirA
krUra manUbArichE vEsAriti ninu kOriti priyA
చరణం
charaNam 1
ఏలార బిగువులు ఈ మోహజాలమునకూ
తాళాగజాలరా ప్రియ తాపంబు తీర్చవేరా ప్రియా
ElAra biguvulu I mOhajAlamunakU
tALAgajAlarA priya tApambu tIrchavErA priyA
చరణం
charaNam 2
కోకిలాలుగూడి కోకోయని యనూచు
కూయాగ మనసు చెదరె
మరుకేళి గూడినాడో ప్రియ
kOkilAlugUDi kOkOyani yanUchu
kUyAga manasu chedare
marukELi gUDinADO priya
చరణం
charaNam 3
పూలసెజ్జపైనీ నే నిదురబోవగాను
నన్నేల విడచిపోయె ఏ సఖిని గూడినాడో ప్రియ
pUlasejjapainI nE nidurabOvagAnu
nannEla viDachipOye E sakhini gUDinADO priya
చరణం
charaNam 4
ధరణి మోహినీ పురవరద విశ్వనాధ
పరాకు వలదు రారా సరసాకు రావదేరా ప్రియ
dharaNi mOhinI puravarada viSwanAdha
parAku valadu rArA sarasAku rAvadErA priya

#90 కరుణించవేరా karuNimchavErA

TitleకరుణించవేరాkaruNimchavErA
Written By
Book#Book1911
రాగం rAgaఅఠాణాaTHANA
తాళం tALaరూపకముrUpakamu
పల్లవి
pallavi
కరుణించవేరా సామీ ననుkaruNimchavErA sAmI nanu
విరసంబు సేయుటెమి సరసంబురా
సహించవేరా తమి
virasambu sEyuTemi sarasamburA
sahimchavErA tami
చరణం
charaNam 1
పానాత్ముడై నమారూచాపంబు గలసిపోరు
నాపాటి కృత్యము మేలు రూపైన జూపు రేపుమాపనకను
pAnAtmuDai namArUchApambu galasipOru
nApATi kRtyamu mElu rUpaina jUpu rEpumApanakanu
చరణం
charaNam 2
పగదాని యిల్లు రేయిపడకాయె నీకు హాయి
పగలైన బల్కవోయి పరువేన యీ బడాయి సేయకను
pagadAni yillu rEyipaDakAye nIku hAyi
pagalaina balkavOyi paruvEna yI baDAyi sEyakanu
చరణం
charaNam 3
మైనాముపేటలోను మగధీరవైతిగాన
నేనైనా గానరాన నానాటికిట్లవునని నరహరనుత
mainAmupETalOnu magadhIravaitigAna
nEnainA gAnarAna nAnATikiTlavunani naraharanuta

#88 చాలు చాలు chAlu chAlu

Titleచాలు చాలుchAlu chAlu
Written By
Book#Book1911
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
చాలు చాలు తాళరా నేనోర్వరాchAlu chAlu tALarA nEnOrvarA
జాలమదేలానె బాలంరతాలోలాjAlamadElAne bAlaMratAlOlA
చరణం
charaNam 1
అక్కాట గుబ్బాలపై రక్కీతివిది న్యాయమా
స్రొక్కీతి గ్రక్కూన తక్కూము మ్రొక్కేద
akkATa gubbAlapai rakkItividi nyAyamA
srokkIti grakkUna takkUmu mrokkEda
చరణం
charaNam 2
శ్వేదోద్ద వంబాయెరా శేదాదీర్చుకొంచునూ
సాదారుడనీ ప్రాసాదాపాదామాన
SwEdOdda vambAyerA SEdAdIrchukomchunU
sAdAruDanI prAsAdApAdAmAna
చరణం
charaNam 3
భూషణములో జిక్కీ బ్రోచేర సుందారాంగ
హాసావిశేషా విభాసమాన శరీర
bhUshaNamulO jikkI brOchEra sumdArAmga
hAsAviSEshA vibhAsamAna SarIra
చరణం
charaNam 4
నీ సమాన పూరుషూనేగాన నీ జగాన
దాసబాలా ఇందిరేశ దోసిలొగ్గితి
nI samAna pUrushUnEgAna nI jagAna
dAsabAlA imdirESa dOsiloggiti

#87 మంచివాడవు mamchivADavu

Titleమంచి వాడవుmanchi vADavu
Written By
Book#Book1911
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
మంచివాడవు లేచిపోరా
ఏరా వంచనాపరా
mamchivADavu lEchipOrA
ErA vamchanAparA
చరణం
charaNam 1
మంచి వాడవులేరా వంచెనదేలా
సించుక కృపజూడవేరా
ఏరా వంచనాపరా
mamchi vADavulErA vamchenadElA
simchuka kRpajUDavErA
ErA vamchanAparA
చరణం
charaNam 2
పంకజాక్షిని గూడనంచు నాపై బాస
లుంచూటా యిది న్యాయమేరా
ఏరా వంచనాపరా
pamkajAkshini gUDanamchu nApai bAsa
lumchUTA yidi nyAyamErA
ErA vamchanAparA
చరణం
charaNam 3
ముందు నన్నేలిన బాలచంద్ర సామి
చందాము తెలసేను పోరా
ఏరా వంచనాపరా
mumdu nannElina bAlachandra sAmi
chamdAmu telasEnu pOrA
ErA vamchanAparA

#86 నేటితో తీరెనురా nETitO tIrenurA

Titleనేటితో తీరెనురాnETitO tIrenurA
Written By
Book#Book1911
రాగం rAgaనాయకిnAyaki
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
నేటితో దీరెనురా నీ నా రుణముnETitO dIrenurA nI nA ruNamu
వాటముగాదికనూ వచ్చుటకునూvATamugAdikanU vachchuTakunU
చరణం
charaNam 1
రేపటమాపట నాపతి
యీచట దాపరించునటా తప్పదటా
rEpaTamApaTa nApati
yIchaTa dAparimchunaTA tappadaTA
చరణం
charaNam 2
మగువమువున్నిక మనసున నెన్నక
సరస నారాయణ రాయా సౌస్తవనీయా
maguvamuvunnika manasuna nennaka
sarasa nArAyaNa rAyA soustavanIyA

#85 బలిజ యేల balija yEla

Titleబలిజ యేలbalija yEla
Written By
Book#Book1911
రాగం rAgaతోడిtODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
బలిజ యేల బాలామణి
అలవానితొ పలుమారూ నీకు
balija yEla bAlAmaNi
alavAnito palumArU nIku
చరణం
charaNam 1
యేమోయని నేమారున నీ మానము కాచుచును
మానామొసగాకానతి కామాతురుడౌచూ
yEmOyani nEmAruna nI mAnamu kAchuchunu
mAnAmosagAkAnati kAmAturuDouchU
చరణం
charaNam 2
తాలా వనలోలునికే వేళానుద లాచుచు
వ్యాకూలపడనేలా సతి వాలాయముగానూ
tAlA vanalOlunikE vELAnuda lAchuchu
vyAkUlapaDanElA sati vAlAyamugAnU
చరణం
charaNam 3
వాని బిలచీ పల్కెడి తనమేల
అలివేణు వెరిగిన మసమానసమంబునా
vAni bilachI palkeDi tanamEla
alivENu verigina masamAnasamambunA