Title | వాల్‌గంటి | vAl^gamTi |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | రూపక | rUpaka |
1 | వాల్‌గంటి సోయగంబునెన్న వశముగాదురా ఘల్ ఘల్ రవంపు నడలు హంసగతుల గేరురా | vAl^gamTi sOyagambunenna vaSamugAdurA ghal ghal ravampu naDalu hamsagatula gErurA |
2 | తొగవిందునకు నెమ్మోమునకతి దూరము గదరా వరకుందనంపు జాయ ముద్దుగుల్కు మేనురా | togavimdunaku nemmOmunakati dUramu gadarA varakundanampu jAya muddugulku mEnurA |
3 | ప్రోయాలు తళ్కుమేల్ పాలిండ్లు పూలచెండ్లురా ప్రాయంపుటింతి మధ్యము గన్పట్టదు గదరా | prOyAlu taLkumEl pAlinDlu pUlachenDlurA prAyampuTimti madhyamu gan&paTTadu gadarA |
4 | అర చందమామ నేలు నెన్నుదురు గల చెలిరా మరువంపు మొల్ల మొగ్గల పల్వరుస పొలతిరా | ara chandamAma nElu nennuduru gala chelirA maruvampu molla moggala palvarusa polatirA |
5 | జలజాతనేత్ర గబ్బిట యజ్ఞన్న కవినుతా వలరేని గన్న మేల్పుమిన్న వనిత నేలరా వాల్‌గంటి సోయగంబుల | jalajAtanEtra gabbiTa yajnanna kavinutA valarEni ganna mElpuminna vanita nElarA vAl^gamTi sOyagambula |