1285 ఏమి సేతురా ప్రాణేశ Emi sEturA prANESa

Titleఏమి సేతురా ప్రాణేశEmi sEturA prANESa
Written By
Book
రాగం rAgaకేదార గౌళkEdAra gouLa
తాళం tALaఅటaTa
పల్లవి pallaviఏమి సేతురా ప్రాణేశ నేనెటువలె తాళుదురాEmi sEturA prANESa nEneTuvale tALudurA
అనుపల్లవి anupallaviఏమో కాని నిన్నెడ బాసినపుడె
ఈ మేన ప్రానము లేమిటికని తోచీ
EmO kAni ninneDa bAsinapuDe
I mEna prAnamu lEmiTikani tOchI
చరణం
charaNam 1
ఒక మాటు నీ మోవానక ఒక పుస్తవు
జిహ్వకు జవిగాడు చేదయ్యీరా
మకురు మనసి నీతో మచ్చికై యున్నట్లు
వేనొక చోటను మోద మొంద నీయదెందు
oka mATu nI mOvAnaka oka pustavu
jihvaku javigADu chEdayyIrA
makuru manasi nItO macchikai yunnaTlu
vEnoka chOTanu mOda monda nIyadendu
చరణం
charaNam 2
నీ మాటలు వినవే కాని
వేరేమియు వీనుల కితవుగాదు
నీ ముద్దు మోము చూడనె కాని యితరము
కామింప నొల్లవు కన్ను లయ్యయ్యో
nI mATalu vinavE kAni
vErEmiyu vInula kitavugAdu
nI muddu mOmu chUDane kAni yitaramu
kAmimpa nollavu kannu layyayyO
చరణం
charaNam 3
ఎలమితో మువ్వ గోపాల యిపుడు నిన్ను నా యెదపై
నలము కొన మన సయ్యీరా
చెలరేగి రతుల సెంతసేపు కూడి
యలసిన తనివి తేరదెందు
elamitO muvva gOpAla yipuDu ninnu nA yedapai
nalamu kona mana sayyIrA
chelarEgi ratula sentasEpu kUDi
yalasina tanivi tEradendu

Leave a comment