| Title | రమ్మనగా దనతో | rammanagA danatO |
| Written By | అన్నమాచార్య | annamAchArya |
| Book | ||
| రాగం rAga | హిందోళ | hindOLa |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | రమ్మనగా దనతో నే రానంటినా చిమ్ముచు నింత ప్రియము చెప్పనేలె నాకు | rammanagA danatO nE rAnanTinA chimmuchu ninta priyamu cheppanEle nAku |
| చరణం charaNam 1 | వెల్ల విరి దన మాట విననైతినా నేను చెల్లబో నాకేల సేవ సేసీనె తాను యెల్ల వారి దానేలీ నెవ్వరి బోలుదు నేను బల్లిదుడు నాకేల బాతిపడీ దానూ | vella viri dana mATa vinanaitinA nEnu chellabO nAkEla sEva sEsIne tAnu yella vAri dAnElI nevvari bOludu nEnu balliduDu nAkEla bAtipaDI dAnU |
| చరణం charaNam 2 | చెప్పినట్లెల్లా నేను సేయకుండే దాననా అప్పటి లేక లేటికి నంపీనె తాను కప్పురపు పడిగల కాంతలు గాచుకుండవా విప్పుచు నాకు గానేల వేగించేనె తానూ | cheppinaTlellA nEnu sEyakunDE dAnanA appaTi lEka lETiki nampIne tAnu kappurapu paDigala kAntalu gAchukunDavA vippuchu nAku gAnEla vEginchEne tAnU |
| చరణం charaNam 3 | గక్కున దాడూడగాను కాదు గూడ దంటినా ముక్కు మోవ సాని లేల మొక్కినె తాను యెక్కువ శ్రీ వెంకటేశుడెనసెదా నన్ను నిట్టి పెక్కు సత్కలతో ననె పెద్ద దేసీ దాను | gakkuna dADUDagAnu kAdu gUDa danTinA mukku mOva sAni lEla mokkine tAnu yekkuva SrI venkaTESuDenasedA nannu niTTi pekku satkalatO nane pedda dEsI dAnu |