| Title | పోయినదెల్లా | pOyinadellA |
| Written By | అన్నమాచార్య | annamAchArya |
| Book | ||
| రాగం rAga | లలిత | lalita |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | పోయినదెల్లా బొల్లు పూచిన దొక్కటె కాక కాయజు కేళికి నింకగ దియ రమ్మనవే | pOyinadellA bollu pUchina dokkaTe kAka kAyaju kELiki nimkaga diya rammanavE |
| చరణం charaNam 1 | అడిగి రావె విభుడెందుకే మనీనో యెడయని దాస నీకిచ్చినాడు నుడుగులు దప్పినాను నోము ఫలము దప్పదు తడని యింతటి నైన దగ్గరి రమ్మనవే | aDigi rAve vibhuDendukE manInO yeDayani dAsa nIkicchinADu nuDugulu dappinAnu nOmu phalamu dappadu taDani yintaTi naina daggari rammanavE |
| చరణం charaNam 2 | పిలిచి రాగదె తన బిరుదెట్లు చెల్లీనో పిలుచు మేనాహి నాకు బెట్టినాడు వెలయ దినగనదె వేమైన దీపవును తలగక యింకనైన దగ్గరి రమ్మనవే | pilichi rAgade tana birudeTlu chellInO piluchu mEnAhi nAku beTTinADu velaya dinaganade vEmaina dIpavunu talagaka yinkanaina daggari rammanavE |
| చరణం charaNam 3 | యిచ్చి రావె యీ విడెము యిన్నిటా మెచ్చితినని కొచ్చిన రతుల నన్ను గూడె నేడు తచ్చిన పక్వాన నంటు తరువ దరువ వెన్న యిచ్చట శ్రీ వేంకటేశునిట్టి రమ్మనవే | yicchi rAve yI viDemu yinniTA mecchitinani kocchina ratula nannu gUDe nEDu tacchina pakvAna nanTu taruva daruva venna yicchaTa SrI vEnkaTESuniTTi rammanavE |