Title | కర్మసంచయ (ప్రతి) | karmasamchaya (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేగడ | bEgaDa |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | కర్మసంచయ ధూమిజకుఠారీ మాహేశ్వరీ శ్రీ కాళి శాంభవి దుర్గ కౌమారి మర్మమేలను రావె శ్రీ గౌరీ యే నిను దలంప నిర్మలాంగివి గదవె త్రిపురారీ మనోహారి | karmasamchaya dhUmijakuThArI mAhESwarI SrI kALi SAmbhavi durga koumAri marmamElanu rAve SrI gourI yE ninu dalampa nirmalAmgivi gadave tripurArI manOhAri |
చరణం charaNam 1 | శీతశైలకుమారి సుకుమారీ నతపతసౌరి శ్రీకరంబుగ నిన్ను మదిగోరి పాతకుడనన నిగమసంచారీ యేల బ్రోవవు పావనిగాదా మనోజారీ కవిజనాధారి | SItaSailakumAri sukumArI natapatasauri SrIkarambuga ninnu madigOri pAtakuDanana nigamasamchArI yEla brOvavu pAvanigAdA manOjArI kavijanAdhAri |
చరణం charaNam 2 | నీలకంధరు రాణి కల్యాణి నను బ్రోవు జలధరవేణి యంబుజపాణి శార్వాణి జాలమేలను రావె శుభవాణి మౌని సంత్రాణి చాలనమ్మితి నిన్ను నెదబూని శైకతత్రోణి | nIlakamdharu rANi kalyANi nanu brOvu jaladharavENi yambujapANi SArvANi jAlamElanu rAve SubhavANi mauni samtrANi chAlanammiti ninnu nedabUni SaikatatrONi |
చరణం charaNam 3 | నాగభూషణ సుకవి పరిపాలా కరుణాలవాల నాగకంకణలోల శ్రీ బాలా జాగుసేయుట నీకు యిది మేలా యేవగనైన శాంభవీ దయజూడుమీవేళా యికను చలమేలా | nAgabhUshaNa sukavi paripAlA karuNAlavAla nAgakamkaNalOla SrI bAlA jAgusEyuTa nIku yidi mElA yEvaganaina SAmbhavI dayajUDumIvELA yikanu chalamElA |