Title | తాళుము వగలేలా | tALumu vagalElA |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | ఫరుజు | faruju |
తాళం tALa | ఏక | Eka |
1 | తాళుము వగలేలా తామస మింతేలనే చాలుచాలునే ఓ తరుణీ తాళిమి లేకను బాలిక తీరున బాళిని జెంది నన్నేలను దూరెద ఓ లలనా గేలి గాదె యిపుడేలనె యీ తమి | tALumu vagalElA tAmasa mimtElanE chAluchAlunE O taruNI tALimi lEkanu bAlika tIruna bALini jemdi nannElanu dUreda O lalanA gEli gAde yipuDElane yI tami |
2 | మారుని బారికి నోరువ లేదని కోరిన సామిని గూరిచినందుకా కీరవాణీ నేరమయ్యె సరివారలు నవ్వెదర | mAruni bAriki nOruva lEdani kOrina sAmini gUrichinamdukA kIravANI nEramayye sarivAralu navvedara |
3 | దంతి గమనరో తమ్మయ భూపతి కంతుని కేళిని గలసిన వేళలో వంతులేలా గిలిగింతవేళా అతి వింతలు బల్కెదవు | damti gamanarO tammaya bhUpati kamtuni kELini galasina vELalO vamtulElA giligimtavELA ati vimtalu balkedavu |