Title | రారా మనవి | rArA manavi |
Written By | ద్విభాష్యం పుల్లకవి | dvibhAshyam pullakavi |
Book | dvibhAshyamNoBook | |
రాగం rAga | నాటకురంజి | nATakuranji |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | రారా మనవి చేకోరా లేచి రారా రారా మనవి చేకోరా మానినీ చిత్తచోరా రాజకుమార వీరా నిన్నే కోరినదిరా మేలౌరా లేలేరా రారా రాజాగేర | rArA manavi chEkOrA lEchi rArA rArA manavi chEkOrA mAninI chittachOrA rAjakumAra vIrA ninnE kOrinadirA mElaurA lElErA rArA rAjAgEra |
చరణం charaNam 1 | మోము చంద్రునితో సమము సంపెంగ నాసికము కెమ్మోవి పగడము శంఖము కంధరము ప్రేమము కామము దీర్పుము క్షేమము | mOmu chandrunitO samamu sampenga nAsikamu kemmOvi pagaDamu Sankhamu kandharamu prEmamu kAmamu dIrpumu kshEmamu |
చరణం charaNam 2 | ఆరు పున్నాగమును గేరు దంతముంచి డారు మల్లె మొగ్గలు మీరు, కన్యకామణి డయరు కన్నుల కర్వుదీరు మై తీరు రంగారు బంగారు నుంగేరు | Aru punnAgamunu gEru damtamunchi DAru malle moggalu mIru, kanyakAmaNi Dayaru kannula karvudIru mai tIru ramgAru bangAru nungEru |
చరణం charaNam 3 | విళ్ళు కన్బొమ్మలు పాలిళ్ళు మల్లెపువ్వుల చెళ్ళు రిక్కలగమి గోళ్ళు బాహువుల్ తిమ్మి తూళ్ళు మీగాళ్ళు తాబేళ్ళు చెవ్రేళ్ళు చిగుళ్ళు | viLLu kan&bommalu pAliLLu mallepuvvula cheLLu rikkalagami gOLLu bAhuvul timmi tULLu mIgALLu tAbELLu chevrELLu chiguLLu |
చరణం charaNam 4 | ఈశా ద్విభాషి పుల్లకవీశా మానినీ మనోల్లాసా భాస్కరసుప్రకాశా భవనాశా జగధీశా దరహాసా లక్ష్మీశా | ISA dvibhAshi pullakavISA mAninI manOllAsA bhAskarasuprakASA bhavanASA jagadhISA darahAsA lakshmISA |